MLA Anirudh Reddy: పవన్ కళ్యాణ్‌కు ప్రొడ్యూసర్ ఉంటేనే గెలుపు.! జడ్చర్ల ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..!
- పవన్ కళ్యాణ్‌పై అనిరుధ్ రెడ్డి తీవ్ర విమర్శలు
- రాజకీయాలను సినిమాలతో పోల్చిన ఎమ్మెల్యే సెటైర్లు
- తెలంగాణపై పవన్ పాత వ్యాఖ్యలను గుర్తుచేసిన కాంగ్రెస్ నేత
- తెలంగాణలో జనసేన రాజకీయాలకు ఫ్లాప్ తప్పదని జోస్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jadcherla MLA Anirudh Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తావన మరోసారి చర్చనీయాంశంగా మారింది. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్‌ను ఒక “నటుడు”గా అభివర్ణిస్తూ, ఆయన రాజకీయ విజయాల వెనుక ఎప్పుడూ ఒక “నిర్మాత” (ప్రొడ్యూసర్) ఉంటారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తన సొంత బలంతో కాకుండా, ఇతర పార్టీల అండతోనే రాజకీయాల్లో నెట్టుకొస్తున్నారని ఆయన ఆరోపించారు.
Samsung 55inch TV Offer: రూ.81,900 టీవీ ఇప్పుడు కేవలం రూ.45,990లకే.! టాప్ ఫీచర్స్ కూడా..!
Also Read
- CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
- Piyush Goyal : వికసిత్ భారత్ సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలి
- OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
- Tragedy: అది ఆత్మహత్య కాదు.. ఫోన్ ఎక్కువగా వాడుతోందని కుమార్తెను గొంతు నులిమి చంపిన కన్నతల్లి..
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని సినిమాలతో పోలుస్తూ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్మాత లేకుండా, అంటే ఒంటరిగా బరిలోకి దిగారని, అందుకే ఆయన దారుణంగా విఫలమై ఒక్క సీటు కూడా గెలవలేకపోయారని గుర్తు చేశారు. అయితే, 2024 ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు నాయుడును “ప్రొడ్యూసర్”గా, నారా లోకేష్‌ను “కో-ప్రొడ్యూసర్”గా పెట్టుకుని గెలిచారని విమర్శించారు. ఇప్పుడు ఏపీలో మంత్రి పదవి వచ్చినా అది సరిపోవడం లేదనే భావనలో పవన్ ఉన్నారని, అందుకే తన రాజకీయ సినిమాను తెలంగాణకు విస్తరించేందుకు ప్రధాని మోదీ అనే కొత్త నిర్మాతను వెతుక్కున్నారని, ‘మోడీ ప్రొడక్షన్స్’లో ఇక్కడ అడుగుపెట్టాలని చూస్తున్నారని అనిరుధ్ రెడ్డి సెటైర్లు వేశారు.
తెలంగాణ ప్రజల పట్ల పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా అనిరుధ్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలది “నరదిష్టి” అని, మన కళ్లు మంచివి కావని పవన్ కళ్యాణ్ గతంలో అన్నారని, అలాంటి వ్యక్తిని తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. మన రాష్ట్ర ప్రజల కళ్లు మంచివి కావని అన్న వ్యక్తి పార్టీ నుండి ఇక్కడ అభ్యర్థులు ఎలా పోటీ చేస్తారని నిలదీశారు. తెలంగాణలో భూముల రేట్లు విపరీతంగా పెరగడం వల్లే ఆంధ్రా నాయకుల కన్ను మన రాష్ట్రంపై పడిందని, అందుకే రకరకాల కారణాలతో ఇక్కడికి రావాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
పవన్ కళ్యాణ్‌ను “ప్యాకేజీ స్టార్” అని ఎద్దేవా చేస్తూ, ఆయన తెలంగాణ రాజకీయాల్లోకి రావాలని చూడటం ఒక “హై బడ్జెట్” సినిమా లాంటిదని అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్కోసారి వెయ్యి కోట్లు పెట్టి తీసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడి, కేవలం 50 కోట్లు కూడా వసూలు చేయలేవని, పవన్ కళ్యాణ్ రాజకీయ సినిమా కూడా తెలంగాణలో అలాగే ఫ్లాప్ అవుతుందని జోస్యం చెప్పారు. ఆంధ్రా నేతల కన్ను మన భూములపై పడకుండా తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారని, ఇక్కడి వారు అమాయకులు కాదని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు.
boAt Loot Deal on Amazon: త్వరపడండి.. రూ.3,990 విలువైన నెక్‌బ్యాండ్ కేవలం రూ.999కే..!
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?