Akbaruddin Owaisi: రెడ్డి అయినా, రావు అయినా మా దగ్గరకు రావాల్సిందే.!
- MIM నేత అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు
- సీఎం దగ్గరకి మేం వెళ్లం.. సీఎంలే మా దగ్గరకి వస్తారు
- జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా మద్దతు లేనిదే కాంగ్రెస్ గెలిచిందా.?
- రెడ్డి అయినా, రావు అయినా.. మా దగ్గరికి రావాల్సిందే
- మున్సిపల్ ఎన్నికల్లో MIM సత్తా ఏంటో చూపిస్తాం. -అక్బరుద్దీన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akbaruddin : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎంఐఎం స్టార్ క్యాంపెయినర్ అక్బరుద్దీన్ ఓవైసీ కరీంనగర్ వేదికగా తనదైన శైలిలో విమర్శల గళం విప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గుర్తు చేస్తూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం కింగ్ మేకర్‌గా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రుల గురించి ప్రస్తావిస్తూ అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మేము ముఖ్యమంత్రుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. పనులు కావాలన్నా, అధికారం కావాలన్నా ముఖ్యమంత్రులే మా దగ్గరకు రావాల్సి ఉంటుంది. అది రెడ్డి అయినా, రావు అయినా ఎవరైనా సరే.. మా మద్దతు లేకుండా రాజకీయం చేయడం సాధ్యం కాదు” అని ఆయన స్పష్టం చేశారు. ఎంఐఎం మద్దతు అనేది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదని, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి తమకుందని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపును అక్బరుద్దీన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. “జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు లేనిదే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారా?” అని ఆయన ప్రశ్నించారు. అక్కడ కాంగ్రెస్‌కు వచ్చిన విజయంలో ఎంఐఎం పాత్ర కీలకమని, ఆ విషయాన్ని వారు మర్చిపోకూడదని పరోక్షంగా హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి తమ అవసరం ఎప్పుడూ ఉంటుందనే సంకేతాలను ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా పంపారు.
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం అద్భుతమైన ప్రతిభ కనబరుస్తుందని అక్బరుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలు , కార్పొరేషన్లలో తమ పార్టీ బలం ఏంటో ప్రత్యర్థులకు చూపిస్తామని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి, అత్యధిక వార్డులను గెలుచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
Samsung 55inch TV Offer: రూ.81,900 టీవీ ఇప్పుడు కేవలం రూ.45,990లకే.! టాప్ ఫీచర్స్ కూడా..!
తాజావార్తలు
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!