Naravane Book Leak: మాజీ ఆర్మీ చీఫ్ ఆత్మకథ లీక్.. ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో బయటపడే నిజాలేమిటి.?
- విడుదలకు ముందే పుస్తకం లీక్
- గల్వాన్, అగ్నిపథ్ అంశాలు వైరల్
- సైబర్ క్రైమ్ రంగంలోకి ఢిల్లీ పోలీసులు
- రక్షణ శాఖ సమీక్షలో ఆత్మకథ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gen Naravane Book Leak:మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రాసిన ఆత్మకథ ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ విడుదలకు ముందే లీక్ అవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రచురణకర్తల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి లోతైన దర్యాప్తును ప్రారంభించారు. ఈ పుస్తకంలోని సున్నితమైన అంశాలు సామాజిక మాధ్యమాల్లో అనధికారికంగా ప్రత్యక్షం కావడంతో, ఇది కేవలం కాపీరైట్ ఉల్లంఘన మాత్రమే కాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా కూడా పరిణమించింది.
ఈ పుస్తకంలో గల్వాన్ లోయ ఘర్షణలు , వివాదాస్పద అగ్నిపథ్ పథకం వంటి అత్యంత కీలకమైన అంశాల గురించి జనరల్ నరవణే తన అనుభవాలను పంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే, పుస్తకం అధికారికంగా మార్కెట్లోకి రాకముందే దానిలోని పిడిఎఫ్ వెర్షన్ ఇంటర్నెట్లో లీక్ అయ్యింది. దీనిపై పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రచురణ సంస్థ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, సైబర్ క్రైమ్ విభాగం ఈ లీక్ మూలాలను వెతికే పనిలో పడింది. గూగుల్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ కంటెంట్ ఎక్కడ షేర్ అయ్యిందో తెలుసుకోవడానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Also Read
- Rahul Gandhi: రాజకీయాల్లో మోడీ ప్రత్యేకం.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Bihar Robbery: బీహార్‌లో పట్టపగలే భారీ దోపిడీ.. గోల్డ్ షోరూమ్‌లో కోట్ల విలువైన నగలు చోరీ!
- UP Elections 2027: యూపీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వనున్న అఖిలేశ్? 24 సీట్లే ఆఫర్ చేసే ఛాన్స్
- MP Govt: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట.. 'ఇద్దరు పిల్లల నిబంధన'ను ఎత్తివేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం..
Amazon సమ్మర్ ధమాకా..! రూ.23,000 Samsung ఫ్రిజ్ ఇప్పుడు కేవలం రూ.15,000 కే..!
సాధారణంగా అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు తమ అనుభవాలను పుస్తక రూపంలో తీసుకువచ్చేటప్పుడు రక్షణ శాఖ (Ministry of Defence) నుండి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా దేశ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక విషయాలు బయటకు రాకుండా చూసేందుకు ఈ సమీక్ష అత్యంత అవసరం. ప్రస్తుతం ఈ పుస్తకాన్ని రక్షణ శాఖ క్షుణ్ణంగా పరిశీలిస్తోందని, ఆ అనుమతి ప్రక్రియ పూర్తి కాకముందే లీక్ జరగడం గమనార్హం. ఈ పుస్తకంలో అగ్నిపథ్ పథకం గురించి సైన్యం అసలు అభిప్రాయాలు ఏమిటి అనే దానిపై ఉన్న విషయాలు ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందన్న చర్చ కూడా నడుస్తోంది.
ప్రస్తుతానికి ఈ పుస్తక ప్రచురణ, పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో ఈ లీక్ వెనుక ఎవరి హస్తం ఉందనేది తేలాల్సి ఉంది. మరోవైపు, రక్షణ శాఖ ఈ పుస్తకంలోని ఏ భాగాలకు అభ్యంతరం చెబుతుందో, ఏ మార్పులు సూచిస్తుందో వేచి చూడాలి. ఒక మాజీ సైన్యాధిపతి తన పదవీ కాలంలోని కీలక ఘట్టాలను ప్రపంచానికి వివరించాలనుకున్న ప్రయత్నం ఇలా వివాదాల్లో చిక్కుకోవడం రక్షణ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..