Brian Bennett: క్యాచ్ ను అలా.. ఎలా? పట్టేశావ్ బ్రో.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brian Bennett: టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వే బోణి కొట్టింది. కొలంబోలోని సిన్హలీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఒమాన్‌తో జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన జింబాబ్వే ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీనితో బ్యాటింగ్ మొదలు పెట్టిన ఒమాన్ కేవలం 27 పరుగులకే సగం మంది బ్యాట్స్మెన్స్ పెవిలియన్ చేరుకున్నారు. జింబాబ్వే పేసర్లు మ్యాచ్‌పై పూర్తి నియంత్రణ సాధించారు. బ్లెస్సింగ్ ముజరబాని, బ్రాడ్ ఎవాన్స్, రిచర్డ్ నగరవా తలో మూడు వికెట్లు తీసి ఒమాన్‌ను 19.5 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌట్ చేశారు. ముజరబాని ఒమాన్ టాప్ ఆర్డర్‌ను కూల్చి 3/16 బౌలింగ్ ఫిగర్స్ తో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పేసర్లు కలిపి 9 వికెట్లు పడగొట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
Tollywood strike: టాలీవుడ్‌లో మళ్లీ ‘సమ్మె’ సైరన్..
Also Read
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ఇక 104 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే కేవలం 13.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. బ్రియాన్ బెన్నెట్ 36 బంతుల్లో అజేయంగా 48 పరుగులు చేసి జట్టును విజయానికి చేర్చాడు. టాడివానాషే మరుమాని 21 పరుగులు చేయగా, బ్రెండన్ టేలర్ 31 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లాడు. ఈ విజయంతో జింబాబ్వే టీ20 ప్రపంచకప్ 2026లో బోణి కొట్టినట్లయింది.
Best Gadget Under రూ.300: బెస్ట్ గ్యాడ్జెట్.. ఈ చిన్న మిషన్ చేసే మ్యాజిక్ చూడండి!
ఇది ఇలా ఉండగా.. ఒమాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఈ సంఘటన జరిగింది. బ్రాడ్ ఎవాన్స్ వేసిన స్లోవర్ డెలివరీని నదీమ్ ఖాన్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి సరైన టైమింగ్‌తో తగలకపోవడంతో డీప్ మిడ్‌వికెట్ ప్రాంతంలో పడేలా వెళ్లింది. అయితే అక్కడే అద్భుతం జరిగింది. బంతికి అమాంతంగా దూరంలో ఉన్న బెన్నెట్ పరుగెత్తుకొచ్చిన చివరి క్షణంలో డైవ్ చేస్తూ గాల్లోనే బంతిని అందుకుని అద్భుత క్యాచ్ పూర్తి చేశాడు. నిజంగా చెప్పాలంటే ఈ క్యాచ్ చూడాలంటే రెండు కళ్ళు చాలవనుకోండి. ఈ క్యాచ్ వీడియోను సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు “క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్”గా చేర్చేశారు. ఇంకెందుకు ఆలస్యం మీరుకూడా ఈ వీడియోను చూసేయండి.
CATCH OF THE TOURNAMENT IS HERE..!!!! 🥶
It's Brian Bennett from Zimbabwe. pic.twitter.com/RmgE92akI4
— Johns. (@CricCrazyJohns) February 9, 2026
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..