Supreme Court: రాష్ట్రాల వార్షిక బడ్జెట్‌ను మించి ఫ్రాడ్.. డిజిటల్ అరెస్ట్‌లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టులో విచారణ..
- అనుమానాస్పద లావాదేవీలపై ఖాతాదారులను తప్పనిసరిగా అలర్ట్ చేయాలి..
- అకస్మాత్తుగా భారీ మొత్తాల ట్రాన్సాక్షన్ అయితే బ్యాంకులు జాగ్రత్తలు తీసుకోవాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, సైబర్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై జరిగిన విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజల డబ్బు రక్షణలో బ్యాంకుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేసింది. అనుమానాస్పద లావాదేవీలు జరిగితే ఖాతాదారులకు తక్షణమే అలర్ట్ ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. అకస్మాత్తుగా భారీ మొత్తాల లావాదేవీలు జరిగితే బ్యాంకులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. అవసరమైతే ఆ లావాదేవీలపై తాత్కాలికంగా హోల్డ్ పెట్టే అధికారం బ్యాంకులకు ఉండాలని స్పష్టం చేసింది.
Read Also: Neena Gupta : సెట్‌లో డైరెక్టర్ బూతులు తిట్టేవాడు..షూటింగ్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చేదాన్ని
Also Read
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
వృద్ధులు, సాధారణ ఖాతాదారులే లక్ష్యం
డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లలో ప్రధానంగా వృద్ధులు, సాధారణ ఖాతాదారులే బాధితులవుతున్నారని పేర్కొంది సుప్రీంకోర్టు… ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా భయపెట్టి డబ్బులు దోచుకుంటున్న ఘటనలు అత్యంత తీవ్రమైనవిగా అభివర్ణించింది. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించేందుకు AI, ఆధునిక టెక్నాలజీని బ్యాంకులు వినియోగించాలి అని ధర్మాసనం సూచించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) ను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
కేంద్రం–RBI సమన్వయం అవసరం
సైబర్ మోసాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం, RBI, బ్యాంకులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది కేవలం ఆర్థిక నేరం మాత్రమే కాకుండా, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే తీవ్రమైన సమస్యగా అభివర్ణించింది. ఇక, హోం మంత్రిత్వ శాఖ (MHA) గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 2021 నుంచి నవంబర్ 2025 వరకు దాదాపు రూ.52,000 కోట్లకు పైగా సైబర్ ఫ్రాడ్ జరిగింది. ఈ మొత్తం అనేక రాష్ట్రాల వార్షిక బడ్జెట్‌ను మించిపోవడం గమనార్హం. ఈ స్థాయిలో మోసాలు జరగడం దేశ ఆర్థిక భద్రతకు పెద్ద ముప్పుగా మారిందని కోర్టు వ్యాఖ్యానించింది. డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లను కట్టడి చేయడంలో నిర్లక్ష్యం వహించకూడదని, ప్రజల సొమ్ము రక్షణే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
-
“ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
ట్రెండింగ్
-
బడ్జెట్‌లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..