Epstein Files: ఫుట్‌బాల్ లీగ్ ఈవెంట్‌లో ఎప్‌స్టీన్ బాధితుల గర్జన.. బిగ్ స్క్రీన్‌పై నిజాలు చెప్పిన మహిళలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికాలో అత్యంత ఫేమస్ ఈవెంట్‌లలో ఒకటైన సూపర్ బౌల్‌ను వేదికగా జెఫ్రీ ఎప్‌స్టీన్ బాధితులు తమ గళాన్ని బలంగా వినిపించారు. సూపర్ బౌల్ అనేది యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఫుట్‌బాల్ లీగ్. ఈ వేదికగా ఎన్నేళ్లుగా తమలో తాము కుంగిపోయిన ఎప్‌స్టీన్ బాధితులు తమ గళాన్ని విప్పారు. చివరికి నిజం బయటకు రావాలంటూ దేశం మొత్తం వినేలా గర్జించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లైంగిక అక్రమ రవాణా స్కాండల్‌గా పేర్కొంటున్న ఈ కేసులో పూర్తి నిజాలు బయటపడాలంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోను ‘వరల్డ్ విదౌట్ ఎక్స్‌ప్లాయిటేషన్’ అనే సంస్థ విడుదల చేసింది. ఇందులో ఎప్‌స్టీన్ బాధితులు ఒక్కొక్కరుగా కెమెరా ముందు మాట్లాడారు. “మాతో పాటు నిలబడండి” అంటూ అమెరికన్లను కోరారు. ముఖ్యంగా యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీని ఉద్దేశించి, ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన మిగిలిన అన్ని రికార్డులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇది కాంగ్రెస్ తీసుకొచ్చిన ‘ఎప్‌స్టీన్ ఫైల్స్ ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్’ ప్రకారం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీడియోలో బాధిత మహిళల మాటలల్లో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. తమ చిన్ననాటి ఫొటోలు చూపిస్తూ, ఎప్‌స్టీన్ చేతుల్లో తాము చిన్నప్పుడే దాడికి గురయ్యామని గుర్తు చేశారు. ఈ నేరాల్లో ఇంకా ఎవరెవరు ఉన్నారో ప్రజలకు తెలియాలంటూ కోరారు. వీడియో చివర్లో స్క్రీన్‌పై పెద్ద అక్షరాల్లో ఒక్క నినాదం అందరినీ ఆకట్టుకుంది. “మాతో నిలబడండి. అటార్నీ జనరల్ పామ్ బాండీకి చెప్పండి: ఇప్పుడు నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది.” అని రాసుకొచ్చారు.
READ MORE: India vs Pakistan: వాటా, సిరీస్‌లు, హ్యాండ్‌షేక్.. పాకిస్థాన్ డిమాండ్స్ ఇవే!
Also Read
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
- Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
సూపర్ బౌల్ రోజున ఈ ప్రకటన ప్రసారం కావడం వెనుక స్పష్టమైన ఉద్దేశం కనిపిస్తోంది. దేశంలో అత్యధికంగా చూసే ఈ ఈవెంట్‌ను ఉద్దేశించి న్యాయశాఖపై ఒత్తిడి పెంచడానికి ఇలా చేశారు. ఇదే ప్రకటనను ఆన్‌లైన్‌లోనూ విడుదల చేశారు. “ప్రతి అమెరికన్ తప్పక చూడాల్సిన సూపర్ బౌల్ యాడ్ ఇదే” అనే టైటిల్‌తో ఆ సంస్థ పోస్ట్ చేసింది. డెమొక్రటిక్ ఎంపీ రాబర్ట్ గార్సియా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మద్దతు తెలిపారు. “ఇది కేవలం ఒక యాడ్ కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద లైంగిక అక్రమ రవాణా కేసు నుంచి మనం సింపుల్‌గా ముందుకు వెళ్లలేం. నిజాన్ని బయటపెట్టాల్సిందే” అని రాసుకొచ్చారు. ఈ ప్రచారం మొదలయ్యే కొద్ది రోజుల ముందే అమెరికా న్యాయశాఖ భారీగా పత్రాలను విడుదల చేసింది. జనవరి 30న సుమారు 30 లక్షల పేజీల డాక్యుమెంట్లు, 2 వేల వీడియోలు, లక్షా ఎనభై వేల చిత్రాలను బయటపెట్టింది. అయితే బాధితులు, హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలు మాత్రం ఇది సరిపోదని అంటున్నాయి. మొత్తం పరిశీలించిన ఫైల్స్‌లో ఇది కేవలం సగమేనని న్యాయశాఖే చెప్పింది. మిగిలిన ఫైల్స్‌లో బాధితుల వివరాలు, చట్ట పరిరక్షణలో ఉన్న సమాచారం ఉందని వెల్లడించింది.
READ MORE: Kohli vs Gambhir: విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య విభేదాలు.. బీసీసీఐ కార్యదర్శి క్లారిటీ
తాజావార్తలు
-
US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
-
Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
-
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?