High Protein Breakfast: తక్కువ టైమ్.. ఎక్కువ ప్రోటీన్.. అప్పటికప్పుడు చేసుకునే సింపుల్ టిఫిన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Protein Breakfast: ఉదయం నిద్రలేవగానే ఇల్లాలికి వచ్చే మొదటి ప్రశ్న.. ఈరోజు టిఫిన్ ఏం చేయాలి? అని. ప్రతిరోజూ తినే ఇడ్లీ, దోశలు బోర్ కొడితే.. అప్పటికప్పుడు ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ‘మూంగ్లెట్’ ప్రయత్నించండి. పెసరపప్పుతో చేసే ఈ వంటకం అటు ఆరోగ్యానికి, ఇటు రుచికి పెట్టింది పేరు. తక్కువ సమయంలోనే తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: PM Modi: కౌలాలంపూర్‌లో ప్రధాని మోడీ కీలక ప్రకటన.. మలేషియాలో త్వరలో UPI సేవలు
Also Read
- Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
- ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
- Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
- India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
దీనికి కావాల్సిన పదార్థాలు..
పెసరపప్పు (పొట్టు ఉన్నది లేదా లేనిది) – 1 కప్పు
ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు
టమాటా, క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు
తగినంత అల్లం, పచ్చిమిర్చి, పసుపు, జీలకర్ర, కొత్తిమీర
పావు టీస్పూన్ వంట సోడా
కాల్చడానికి సరిపడా బటర్ లేదా ఆయిల్
తయారీ విధానం..
ముందుగా ఒక కప్పు పెసరపప్పును శుభ్రంగా కడిగి కనీసం 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఉదయాన్నే చేయాలనుకుంటే ముందు రోజు రాత్రే నానబెట్టుకోవడం ఉత్తమం. నానిన పప్పును మిక్సీ జార్‌లోకి తీసుకుని.. అందులో అల్లం ముక్క, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయలు, టమాటా, క్యారెట్, క్యాప్సికం, కొత్తిమీర ముక్కలను కలిపి బాగా మిక్స్ చేయాలి. చివరగా పిండి ఫ్లఫీగా రావడానికి కొద్దిగా వంట సోడా కలపాలి.
స్టవ్ మీద పాన్ పెట్టి కాస్త బటర్ లేదా ఆయిల్ వేసి వేడి చేయాలి. పిండిని అర ఇంచ్ మందంలో అట్టులా పరచాలి. పైన మరిన్ని వెజిటబుల్స్ కూడా చల్లుకోవచ్చు. మంటను తక్కువలో పెట్టి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టి వేయించాలి. హోటల్ స్టైల్ రుచి కావాలంటే మధ్యలో చిన్న గాట్లు పెట్టి మరికొంచెం బటర్ వేసి రోస్ట్ చేయాలి. ఈ మూంగ్లెట్లోకి కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, నిమ్మరసంతో చేసిన గ్రీన్ చట్నీ కలిపి తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. ఇది ఎందుకు తినాలి అంటే.. పెసరపప్పులో అధిక ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు ఉంటాయి. ఇది వెజిటేరియన్లకు ఒక ‘సూపర్ ఫుడ్’. పిల్లలకు లంచ్ బాక్స్‌లో ఇచ్చేందుకు లేదా సాయంత్రం స్నాక్స్‌లా తినేందుకు కూడా ఇది ఒక సూపర్ ఛాయిస్.
READ ALSO: FUNKY Trailer: అనుదీప్ మార్క్ కామెడీతో.. విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ట్రైలర్!
తాజావార్తలు
-
Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
-
ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
-
Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
-
India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
-
Digital Arrest Scam: డిజిటల్ మోసాల్లో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!