Vitamins Rich Foods: విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు ఇవే.. ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం!
- శరీరం ఆరోగ్యంగా పనిచేయాలంటే విటమిన్లదే కీలక పాత్ర
- రోజువారీ ఆహారంలో సరైన విటమిన్లు ఉండేలా చూసుకోవాలి
- సహజ ఆహారాల ద్వారానే విటమిన్లను పొందితే మరింత ఆరోగ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత బిజీ బిజీ జీవితంలో మన శరీరం ఆరోగ్యంగా పనిచేయాలంటే.. ‘విటమిన్లు’ కీలక పాత్ర పోషిస్తాయి. రోగనిరోధక శక్తి పెంపు నుంచి.. చర్మం, కళ్ళు, ఎముకల ఆరోగ్యం వరకు ప్రతీ అంశంలో విటమిన్లు చాలా అవసరం. రోజువారీ ఆహారంలో సరైన విటమిన్లు ఉండేలా చూసుకుంటే.. అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. సహజ ఆహారాల ద్వారానే విటమిన్లను పొందితే ఆరోగ్యం మరింత బలంగా ఉంటుంది. సమతుల్యమైన ఆహారమే మంచి ఆరోగ్యానికి మార్గం. ఈ నేపథ్యంలో ముఖ్యమైన విటమిన్లు, వాటికి సంబంధించిన ఆహార పదార్థాలు ఏమిటో చూద్దాం.
విటమిన్ C:
విటమిన్ C శరీరానికి సహజ రక్షణ వ్యవస్థను బలపరుస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. నారింజలు, కివీ, స్ట్రాబెర్రీలు, బెల్ పెప్పర్లు విటమిన్ C పుష్కలంగా ఉన్న ఆహారాలు. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలకంగా పనిచేస్తాయి.
Also Read
- Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
- How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
- Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
- Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
విటమిన్ D:
ఎముకల ఆరోగ్యానికి విటమిన్ D అత్యంత అవసరం. ఇది కాల్షియం శోషణకు సహాయపడుతుంది. సార్డిన్స్ చేపలు, పాలు, మష్రూమ్స్, చీజ్ వంటి ఆహారాల్లో విటమిన్ D ఎక్కువగా ఉంటుంది. సూర్యకాంతి కూడా సహజ వనరు కావడం విశేషం.
విటమిన్ E:
విటమిన్ E ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది చర్మాన్ని కాపాడటంతో పాటు కణాల పెరుగుదలకు దోహదం చేస్తుంది. బాదం, అవకాడో, హేజిల్ నట్స్, పైన్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్ E సమృద్ధిగా లభిస్తుంది.
విటమిన్ A:
కంటి చూపును మెరుగుపరచడంలో విటమిన్ A కీలకంగా ఉంటుంది. క్యారెట్లు, పాలకూర, మామిడి పండ్లు, కాంతలోప్ వంటి పండ్లు, కూరగాయలు ఈ విటమిన్‌కు మంచి వనరులు. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి.
విటమిన్ B:
విటమిన్ B శరీరానికి శక్తిని అందించడంలో కీలకంగా ఉంటుంది. ఓట్స్, గుడ్లు, బీన్స్, బీఫ్ వంటి ఆహారాల్లో విటమిన్ B ఎక్కువగా ఉంటుంది. మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.
Also Read: BCCI vs PCB: నీయవ్వ తగ్గేదేలే.. పాకిస్థాన్ డిమాండ్లకు నో చెప్పిన బీసీసీఐ!
విటమిన్ B1:
విటమిన్ B1 (థయమిన్) నరాల వ్యవస్థను బలపరుస్తుంది. మాంసం, బ్రౌన్ రైస్, బ్లాక్ బీన్స్, ఆలుగడ్డలు విటమిన్ B1కి మంచి వనరులు.
విటమిన్ B6:
విటమిన్ B6 మెదడు అభివృద్ధి, హార్మోన్ల నియంత్రణలో సహాయపడుతుంది. సాల్మన్ చేప, అరటిపండ్లు, సెనగలు, చికెన్‌లో ఈ విటమిన్ సమృద్ధిగా ఉంటుంది.
విటమిన్ K:
విటమిన్ K రక్తం గడ్డకట్టే ప్రక్రియకు చాలా అవసరం. కేల్ ఆకుకూర, బ్రోకోలీ, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్, ప్రూన్స్ వంటి ఆహారాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది.
తాజావార్తలు
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
-
RRB Jobs : రైల్వేలో 1,265 ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేటి నుంచే అవకాశం
-
OTR: మాగంటి బాబును పక్కన పెట్టిన టీడీపీ పెద్దలు.! మాగంటి రాజకీయానికి బ్రేక్ పడినట్టేనా?
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!