America: అమెరికాను అంధకారంలోకి నెట్టేస్తున్న చిన్న పొరపాటు ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America: సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ప్రస్తుతం అగ్రరాజ్యధినేతను అమెరికాలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన ఒక నివేదిక ఆందోళనల కలిగిస్తుంది. వాస్తవానికి అమెరికాలోని సగానికి పైగా పవర్ ట్రాన్స్ఫార్మర్లు పనిచేయడం లేదు. ఈ ట్రాన్స్ఫార్మర్లకు శక్తినివ్వడానికి పునరుత్పాదక శక్తిని ఉపయోగిస్తే, మొత్తం వ్యవస్థ కూలిపోతుంది, ఈ చిన్న తప్పు చేస్తే అమెరికా మొత్తం అంధకారంలోకి నెట్టివేయబడుతుంది.
Also Read
- Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
- IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
- Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
- Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
అందుకే డోనాల్డ్ ట్రంప్ పునరుత్పాదక ఇంధన వనరులకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం.. అమెరికాలో దాదాపు 80 మిలియన్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. వీటిని విద్యుత్ సరఫరా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. పవర్ సిస్టమ్ టెక్నాలజీ నివేదిక ప్రకారం.. అమెరికాలోని 55 శాతం ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు నిరుపయోగంగా ఉన్నాయి. ఈ ట్రాన్స్ఫార్మర్లు ప్రస్తుత జీవితకాలం 33 ఏళ్లు. నిజానికి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క గరిష్ట జీవితకాలం 35 సంవత్సరాలు, అంటే ఇంకో రెండేళ్ల తర్వాత, ఈ ట్రాన్స్ఫార్మర్లు ఉపయోగపడవు.
పలు నివేదిక ప్రకారం.. అమెరికాలో దాదాపు 20 శాతం ట్రాన్స్ఫార్మర్లు 25 ఏళ్ల వయస్సు గలవని, ఇప్పటికీ 25 శాతం మాత్రమే యునైటెడ్ స్టేట్స్లో ఉపయోగించదగినవి ఉన్నాయని సమాచారం. 2024లో US డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఒక నివేదికను విడుదల చేసింది. US ట్రాన్స్ఫార్మర్లలో సగానికి పైగా చాలా పాతవి, అవి విశ్వసనీయంగా పనిచేయలేవు, ఎప్పుడైనా విఫలం కావచ్చని ఆ నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, వీలైనంత ఎక్కువగా పునరుత్పాదక శక్తిని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాయి. అమెరికా కూడా ఈ చొరవను కొనసాగిస్తోంది, కానీ ట్రంప్ పరిపాలన ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇది అమలు చేస్తే, భవిష్యత్తులో అమెరికా అంధకారంలోకి నెట్టబడుతుందని ట్రంప్ ప్రభుత్వం భయపడుతోంది. అందుకే అమెరికా పాత, బాగా స్థిరపడిన పద్ధతిని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి, సరఫరాను కొనసాగించాలని డిసైడ్ అయ్యింది.
ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేసిన అమెరికా..
IEA నివేదిక ప్రకారం.. అమెరికా యూరప్, మెక్సికో నుంచి ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేస్తుంది. ఎనర్జీ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ గ్రూప్ వుడ్ మెకెంజీ నివేదిక ప్రకారం.. అమెరికా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సరఫరాలో 80 శాతం, పంపిణీ ట్రాన్స్ఫార్మర్ల సరఫరాలో 50 శాతం దిగుమతుల నుంచి వస్తున్నాయి. 2025 లో అమెరికాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సరఫరా 30 శాతం తగ్గుతుందని, పంపిణీ ట్రాన్స్ఫార్మర్ల కొరత 10 శాతానికి చేరుకుంటుందని ఈ నివేదిక వెల్లడించింది. ఏది ఏమైనా ఒక చిన్న పొరపాటు ఇప్పుడు అమెరికాను అంధకారంలోకి నెట్టి వేసే ఛాన్స్ ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Samsung 55inch TV Offer: రూ.81,900 టీవీ ఇప్పుడు కేవలం రూ.45,990లకే.! టాప్ ఫీచర్స్ కూడా..!
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..