BCCI: బీసీసీఐ సెలక్షన్ కమిటీలో సంచలనం!
- భారత క్రికెట్‌లో మరో కీలక మార్పు జరగబోతుందా?
- అజిత్ అగార్కర్ స్థానంలో ద్రవిడ్
- భవిష్యత్తు రూపకల్పన చేయడంలో ద్రవిడ్ కీలక పాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్‌లో మరో కీలక మార్పు జరగబోతుందా? అంటే.. అవుననే సమాధానాలు విపిస్తున్నాయి. ప్రస్తుతం భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఉన్న అజిత్ అగార్కర్ స్థానంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్, లెజెండరీ బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ద్రవిడ్ కోచ్‌గా ఉన్నపుడు భారత్ టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన విషయం తెలిసిందే. స్వదేశీ, విదేశీ గడ్డలపై అద్భుత విజయాలు అందుకుంది.
భారత జట్టు కోచ్‌గా తన పదవీకాలంలో రాహుల్ ద్రవిడ్ యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేసిన విషయం తెలిసిందే. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లలో భారత జట్టుకు భవిష్యత్తు రూపకల్పన చేయడంలో ద్రవిడ్ కీలక పాత్ర పోషించారు. అతడి ఆలోచన విధానం, ఆటగాళ్లను అర్థం చేసుకునే తత్వం సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి సరైనదిగా బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇటీవలి కాలంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే రాబోయే సంవత్సరాల్లో భారత్‌కు వరుసగా పెద్ద టోర్నీలు ఉండటంతో.. కొత్త దృష్టికోణం అవసరమన్న అభిప్రాయం బోర్డు వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ద్రవిడ్ పేరును బీసీసీఐ పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం.
Also Read
- West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
- MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
Also Read: India vs Pakistan: నష్టపరిహారం, సస్పెన్షన్.. పీసీబీ, ఐసీసీ మీటింగ్ లేటెస్ట్ డీటెయిల్స్ ఇవే!
ఈ వార్త నిజమైతే.. భారత క్రికెట్‌లో ఇది ఒక కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. ఆటగాడిగా, కోచ్‌గా అపార అనుభవం ఉన్న రాహుల్ ద్రవిడ్.. సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపడితే, టీమిండియా జట్టు ఎంపిక ప్రక్రియలో స్పష్టత, స్థిరత్వం మరింత పెరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్కు ముందు సోనమ్ వాంగ్చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!