No-Confidence Motion: లోక్ సభ స్పీకర్‌పై అవిశ్వాసానికి రెడీ అవుతున్న అపోజీషన్! ఎలా తొలగిస్తారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No-Confidence Motion: ప్రతిపక్ష పార్టీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించేందుకు రెడీ అవుతున్నాయి. ఆయనపై అవిశ్వాస తీర్మానం తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయని సమాచారం. పలు నివేదికల ప్రకారం.. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఏర్పాటు చేసిన ఇండియా బ్లాక్ సమావేశంలో ఈ విషయం చర్చించినట్లు సమాచారం. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని సభలో మాట్లాడటానికి అనుమతించకపోవడం వంటి అనేక కారణాలు దీనికి ఆజ్యం పోశాయని టాక్. బడ్జెట్ సమావేశాల మొదటి వారంలో స్పీకర్ ఓం బిర్లా ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. వారిలో ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు కూడా ఉన్నారు.
READ ALSO: Aadi Sai Kumar: మరోసారి హారర్ త్రిల్లర్‌నే నమ్ముకున్న ఆది సాయికుమార్..
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
స్పీకర్‌ను ఎలా తొలగిస్తారు..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 94-C కింద ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. స్పీకర్‌ను తొలగించడం, ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష నాయకుడు మాట్లాడకుండా నిరోధించడం, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేపై చర్య తీసుకోవడంలో వైఫల్యానికి వ్యతిరేకంగా ఈ తీర్మానం నోటీసు దాఖలు చేశారు. కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధారమైన ఆరోపణలు చేయడం, ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం వంటివి ఈ తీర్మానం ప్రవేశ పెట్టడానికి కారణం అయ్యాయన చెబుతున్నారు.
లోక్‌సభ స్పీకర్‌ను తొలగించే విధానం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 94లో వివరించారు. సభలో ఆమోదించిన ప్రత్యేక తీర్మానం ద్వారా మాత్రమే స్పీకర్‌ను తొలగించవచ్చని ఈ చట్టం పేర్కొంది. ఈ ప్రక్రియ అనేక షరతులకు లోబడి ఉంటుంది. స్పీకర్‌ను తొలగించడానికి, మొదట సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతారు. తీర్మానానికి 14 రోజుల ముందుగానే నోటీసు ఇవ్వాలి. ముఖ్యంగా లోక్‌సభలో కనీసం 50 మంది సభ్యులు మద్దతు ఇస్తేనే ఈ తీర్మానాన్ని అమలు చేయవచ్చు. ఈ కనీస మద్దతు లేకుండా, తీర్మానాన్ని సభలో ఆమోదించరు. 14 రోజుల ముందుగానే ఇవ్వాల్సిన నోటీసుకు 50 మంది సభ్యుల సంతకాలు కూడా అవసరం. నోటీసు ఆమోదించిన తర్వాత, ఈ తీర్మానంపై స్పీకర్ చర్చకు తేదీని నిర్దేశిస్తారు. చర్చకు తేదీ 10 రోజులు మించకూడదు. లోక్‌సభలో హాజరై ఓటు వేసే ఎంపీలలో సాధారణ మెజారిటీ తీర్మానానికి మద్దతు ఇస్తే స్పీకర్ పదవి నుంచి తొలగిస్తారు. రాజ్యాంగ సవరణల విషయంలో ఉన్నట్లుగా, ఓటింగ్ ప్రక్రియకు 2/3 వంతు మెజారిటీ అవసరం లేదు. కేవలం మెజారిటీ సరిపోతుంది.
తొలగింపు తీర్మానంపై చర్చలో స్పీకర్ పాల్గొంటారా?
లేదు. లోక్‌సభ స్పీకర్‌ను తొలగించే తీర్మానం చర్చకు వచ్చినప్పుడు, స్పీకర్ సభకు అధ్యక్షత వహించరు. డిప్యూటీ స్పీకర్ సభ్యుల కోసం కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఈ తీర్మానం ఆమోదం పొందితే, స్పీకర్ వెంటనే తన పదవి నుంచి వైదొలగాల్సి వస్తుంది. కానీ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతారు. ఈ ప్రక్రియ తర్వాత, లోక్‌సభకు కొత్త స్పీకర్ ఎన్నికవుతారు.
READ ALSO: Tollywood strike: టాలీవుడ్‌లో మళ్లీ ‘సమ్మె’ సైరన్..?
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!