Best Gadget Under రూ.300: బెస్ట్ గ్యాడ్జెట్.. ఈ చిన్న మిషన్ చేసే మ్యాజిక్ చూడండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Best Gadget Under రూ.300: ఈ రోజుల్లో ఉదయం లేచిన దగ్గర్నుంచి ఆఫీసుకో, స్కూలుకో వెళ్లే హడావిడిలో బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి కూడా టైం ఉండని సందర్భాలు ప్రతిఒక్కరికి ఎప్పుడో ఒకసారి ఎదురై ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా బ్యాచిలర్స్‌కు ఈ అనుభవం కచ్చితంగా ఉంటుంది. చాలా మందికి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే గుడ్లును ఉడకబెట్టుకోవడం అంటే పెద్ద తలకాయ నొప్పి పనిలా ఉంటుంది. అలాంటి వారికోసమే మార్కెట్లోకి వచ్చేసింది ఒక సూపర్ గ్యాడ్జెట్ అదే.. ‘స్మార్ట్ ఎగ్ బాయిలర్’. దీని ప్రత్యేకతలు ఏంటి, ఈ చిన్న మిషన్ చేసే పెద్ద మ్యాజిక్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: AP Assembly Session: అసెంబ్లీ సమావేశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా చూసే అవకాశం.. ఇలా సంప్రదించండి..
Also Read
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
సాధారణంగా మనం గ్యాస్ స్టవ్ మీద గుడ్లు ఉడకబెడితే ఎంతలేదన్నా 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. కానీ ఈ ఎలక్ట్రిక్ బాయిలర్ కేవలం 5 నిమిషాల్లోనే మీ పని ముగిస్తుంది. అమెజాన్ వంటి సైట్లలో కేవలం రూ. 299 నుంచే ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇది కేవలం 350 వాట్ల విద్యుత్‌నే వాడుకుంటుంది, కాబట్టి మీకు కరెంట్ బిల్లు పెరుగుతుందన్న భయం కూడా అక్కర్లేదు. నిజానికి ఇదొక ఎగ్ బాయిలర్ అయినప్పటికీ, దీంతో మీరు ఎన్నో పనులు చేసుకోవచ్చు.
దీంట్లో మీరు 7 గుడ్లు ఒకేసారి ఉడికించుకోవచ్చు. అలాగే బంగాళదుంపలు, క్యారెట్లు, స్వీట్ కార్న్ వంటి వాటిని కూడా ఆవిరిపై హెల్దీగా ఉడికించుకోవచ్చు. ఇందులో ఉన్న సెన్సార్ల వల్ల గుడ్లు ఉడకగానే అదే ఆగిపోతుంది. గ్యాస్ దగ్గర ఉన్నట్లు అక్కడే ఉండి గుడ్లు ఎప్పుడు ఉడుకుతాయో అని దాని దగ్గరే ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదు.
ఏ బ్రాండ్ .. ఎంత ధరకో తెలుసుకోండి..
అమెజాన్ బేసిక్స్: ఇది రూ. 389 కి లభిస్తుంది. దీనితో పాటు నీటిని కొలవడానికి ఒక కప్పును కూడా ఇస్తారు.
లైఫ్‌లాంగ్: బిగ్ బాస్కెట్‌లో ఇది రూ. 399 కి అందుబాటులో ఉంది. ఇది చాలా మన్నికైనది.
లైఫ్‌లాంగ్ 2-ఇన్-1 (పోచర్): పెంకు లేకుండా కేవలం గుడ్డు లోపలి సొనను మాత్రమే ఉడికించుకునే ‘పోచ్డ్ ఎగ్స్’ అంటే ఇష్టపడే వారికి ఇది బెస్ట్. దీని ధర రూ. 765.
తక్కువ ధరలో వంట పనిని సులభం చేసుకోవాలనుకునే వారికి ఈ గ్యాడ్జెట్ ఒక వరం లాంటిదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
READ ALSO: What’s Up Naresh: ఆసక్తికరంగా ‘వాట్స్ అప్ నరేష్’ ఫస్ట్ గ్లింప్స్.. చూశారా!
తాజావార్తలు
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?