రూ. 6,799కే మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్, 5000mAh భారీ బ్యాటరీ.. itel A100 స్మార్ట్‌ఫోన్ లాంచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
itel A100: ఐటెల్ (itel) లోని బడ్జెట్ ఫ్రెండ్లీ ‘A’ సిరీస్‌ను మరింత పెంచుతూ.. భారత మార్కెట్లో సరికొత్త ఐటెల్ A100 (itel A100) స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. గత ఏడాది విడుదలైన itel A90 కి ఇది అప్డేటెడ్ గా నిలవనుంది. ఈ ఫోన్ లో ప్రధాన ఆకర్షణ MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్. ఇక ఇందులో 6.6 అంగుళాల HD+ డిస్ప్లేను అందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఇందులో ఆపిల్ ఫోన్లలో కనిపించే డైనమిక్ ఐలాండ్ తరహాలోనే ‘డైనమిక్ బార్ (Dynamic Bar)’ ఫీచర్‌ను చేర్చారు. దీని ద్వారా బ్యాటరీ స్టేటస్, కాల్స్, నోటిఫికేషన్లను డిస్టర్బెన్స్ లేకుండా నేరుగా స్క్రీన్ పైభాగంలో చూడవచ్చు.
Scotland vs Italy: స్కాట్లాండ్ భారీ విజయం.. కట్ చేస్తే పాయింట్ల పట్టికలో!
Also Read
- Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
- Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
- DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
- Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
ఈ ఫోన్‌లో మరో ఆసక్తికరమైన ఫీచర్ ‘IR బ్లాస్టర్’. దీని సహాయంతో టీవీలు, ఏసీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను రిమోట్‌లా కంట్రోల్ చేయవచ్చు. అలాగే మెరుగైన ఆడియో అనుభవం కోసం DTS సౌండ్ టెక్నాలజీని అందించారు. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఈ ఫోన్ భారతదేశం అంతటా ఉన్న ప్రముఖ రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. కొనుగోలు చేసిన 100 రోజుల్లోపు ఒకసారి ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ చేసుకునే సదుపాయాన్ని కంపెనీ కల్పిస్తోంది.
itel A100 ఫీచర్లు:
ప్రాసెసర్: ఇందులో UNISOC T7100 (12nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు.
ర్యామ్ & స్టోరేజ్: ఇది 3GB & 4GB ర్యామ్ ఆప్షన్లలో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా దీనిని మరో 8GB వరకు పెంచుకోవచ్చు. 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు మైక్రో SD కార్డ్ సదుపాయం కూడా ఉంది.
సాఫ్ట్‌వేర్: ఇది లేటెస్ట్ Android 15 (Go Edition) పై నడుస్తుంది.
కెమెరా: వెనుకవైపు 8MP కెమెరా (LED ఫ్లాష్‌తో), సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
బ్యాటరీ: 5000mAh భారీ బ్యాటరీతో పాటు 10W ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. ఇంకో కేసులో 14 రోజుల రిమాండ్..
* itel A100 సిల్క్ గ్రీన్, ప్యూర్ బ్లాక్, టైటానియం గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంది.
* 3GB + 64GB వేరియంట్ ధర: రూ. 6,799
* 4GB + 64GB వేరియంట్ ధర: రూ. 7,499.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..