సగం ధరకే Wobble QLED TV.. బెస్ట్ ఫీచర్లు, క్వాలిటీ సౌండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బడ్జెట్‌లో స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని చూసేవారికి ఓ మంచి అవకాశమనే చెప్పాలి.. భారతీయ స్మార్ట్ టీవీ మార్కెట్‌లో దేశీయ బ్రాండ్ల హవా కొనసాగుతుండగా.. సరసమైన ధరల్లో పెద్ద స్క్రీన్ లగ్జరీని అందించే టీవీలకు డిమాండ్ పెరిగింది. అలాంటి టీవీల్లో ఒకటిగా Wobble X సిరీస్ QLED స్మార్ట్ టీవీ మార్కెట్‌లోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ టీవీని ఉపయోగించినవారి అనుభవం ఆధారంగా దీనిపై ఓ సమీక్ష..
వోబుల్ బ్రాండ్ బ్యాక్‌గ్రౌండ్
వోబుల్ (Wobble) కొత్త బ్రాండ్‌లా కనిపించినా, దీని వెనుక ఉన్న సంస్థ ఇండ్కల్ టెక్నాలజీ. ఇదే సంస్థ భారత్‌లో Acer బ్రాండెడ్ ఎలక్ట్రానిక్స్‌ను విక్రయిస్తోంది. గత ఏడాది వోబుల్ తన X సిరీస్ QLED స్మార్ట్ టీవీలను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. Wobble X సిరీస్ టీవీలు ఫ్రేమ్‌లెస్ డిజైన్‌తో వస్తాయి. బిల్ట్ క్వాలిటీ బలంగా అనిపిస్తుంది. బాక్స్‌లో టీవీ స్టాండ్, అవసరమైన కేబుల్స్ అందిస్తారు. పవర్ కేబుల్ డిటాచబుల్‌గా ఉండటం మరో మంచి ఫీచర్.
Also Read
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
టీవీకి ఒక వైపు పవర్ పోర్ట్, మరోవైపు HDMI, USB వంటి అన్ని అవసరమైన పోర్టులు ఉన్నాయి. డౌన్‌వర్డ్ ఫైరింగ్ స్పీకర్లు కూడా ఇందులో ఉన్నాయి. డిజైన్ పరంగా పెద్దగా కొత్తదనం లేకపోయినా, ప్రీమియం లుక్ మాత్రం ఇస్తుంది. ఇక, ఈ టీవీ యొక్క ప్రధాన ఆకర్షణ QLED Ultra HD డిస్‌ప్లే.. 4K రిజల్యూషన్, HDR10 సపోర్ట్, Dolby Vision సర్టిఫికేషన్.. 120Hz రిఫ్రెష్ రేట్ కారణంగా, 60Hz టీవీలతో పోలిస్తే స్క్రోల్, గేమింగ్, ఫాస్ట్ యాక్షన్ సీన్స్ మరింత స్మూత్‌గా కనిపిస్తాయి. డాల్బీ విజన్ డార్క్, బ్రైట్ మోడ్‌లు ఉండటం వల్ల కంటెంట్‌ను మనకు నచ్చిన విధంగా ట్యూన్ చేసుకోవచ్చు. గేమింగ్ మోడ్, మూవీ మోడ్, AI అప్‌స్కేలింగ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్‌లో గేమింగ్ కోసం చూస్తున్న వారికి ఇది మంచి ఎంపిక.
సాఫ్ట్‌వేర్, పనితీరు, సౌండ్..
Wobble X సిరీస్ టీవీ Android 14 ఆధారిత Google TV 2.0పై పనిచేస్తుంది.. 2GB RAM, 16GB స్టోరేజ్.. లేటెస్ట్ గూగుల్ టీవీ ఇంటర్‌ఫేస్ స్మూత్‌గా పనిచేస్తుంది. యాప్స్ ఓపెన్ చేయడంలో పెద్దగా లాగ్ కనిపించలేదు. అయితే సాఫ్ట్‌వేర్ పరంగా పూర్తిగా కొత్త అనుభూతి మాత్రం ఉండదని చెబుతున్నారు.. ఇక, సౌండ్ విషయానికి వస్తే.. ఈ టీవీ మరో హైలైట్ 80W 2.1 ఛానల్ స్పీకర్ సిస్టమ్.. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో వచ్చే ఈ స్పీకర్లు లౌండ్‌గా.. క్లియర్‌గా వినిపిస్తాయి. సాధారణ గది వినియోగానికి 20–25 శాతం వాల్యూమ్ సరిపోతుంది.. ఈ బడ్జెట్‌లో ఇంత పవర్‌ఫుల్ ఆడియో అరుదు అని చెప్పాలి.
రిమోట్, కనెక్టివిటీ మరియు ధర
బ్లూటూత్ సపోర్ట్ ఉన్న స్పోర్ట్స్ రిమోట్‌తో టీవీ వస్తుంది. హోమ్ + బ్యాక్ బటన్‌లను ఒకేసారి నొక్కి టీవీకి కనెక్ట్ చేయాలి. రిమోట్ స్పందన వేగంగా ఉంటుంది. యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వంటి యాప్స్‌కు ప్రత్యేక హాట్‌కీలు కూడా ఉన్నాయి. Wobble 55-అంగుళాల X సిరీస్ QLED టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. లిస్టెడ్ ధర రూ.32,999గా ఉండగా.. బ్యాంక్ ఆఫర్ తర్వాత సుమారు రూ.30,000గా సొంతం చేసుకోవచ్చు.. దీని అసలు MRP రూ.77,999గా ఉంది.. అంటే ప్రస్తుతం ఈ టీవీని సగం ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది..
బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్, QLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, పవర్‌ఫుల్ 80W సౌండ్ కావాలంటే Wobble X సిరీస్ QLED TV మంచి ఎంపిక. ఇదే ఫీచర్లతో సోనీ, సామ్‌సంగ్, LG వంటి బ్రాండ్ల టీవీలు కొనాలంటే కనీసం రూ.50,000 పైగా ఖర్చు అవుతుంది. అయితే కొనుగోలు చేసే ముందు మీ ప్రాంతంలో సర్వీస్ సపోర్ట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
-
Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!