SBI YONO App: ఎస్బీఐ యోనో యూజర్లు బీ అలర్ట్.. ఈ తప్పు చేస్తే ఖాతా ఖాళీ!
- ఎస్బీఐ యోనో యూజర్లు బీ అలర్ట్
- SBI కస్టమర్లకు వాట్సాప్ ద్వారా నకిలీ సందేశాలు
- సైబర్ మోసం హెల్ప్‌లైన్ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని SBI సూచించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోట్లాది మంది ఖాతాదారులలో, లక్షలాది మంది వినియోగదారులు SBI YONO యాప్‌ను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ SBI YONO యాప్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే హ్యాకర్లు తమను లక్ష్యంగా చేసుకుని వారి ఖాతాలను ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. హ్యాకర్లు, సైబర్ నేరస్థుల ఈ చర్య నుండి తమను తాము రక్షించుకోవాలని SBI తన వినియోగదారులను హెచ్చరించింది. ఖాతాను ఖాళీ చేయడానికి ఎలా కుట్రలు పన్నారు.. వాటిని ఎలా నివారించవచ్చో తెలుసుకోండి.
Also Read:Delhi: ఢిల్లీలో కలకలం.. పార్కింగ్ కారులో మృ*తదేహాలు
Also Read
- Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
- Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
- Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
- Kishan Reddy : డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే ప్రధాని మోదీ లక్ష్యం
SBI కస్టమర్లకు వాట్సాప్ ద్వారా నకిలీ సందేశాలు వస్తున్నాయి. SBI తన కస్టమర్లను X లో హెచ్చరిస్తూ ఒక స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది, దాని పైన SBI లోగో ఉంది. కింద “ప్రియమైన SBI కస్టమర్, మీ ఖాతాలో ఆధార్ అప్డేట్ చేయనందున, ఈ రాత్రి నుండి మీ SBI YONO ఖాతా బ్లాక్ చేయబడుతుందని మీకు సమాచారం అందుతోంది. మీకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. మీరు మా అధికారిక ఆధార్ అప్డేట్ APK ని ఇన్స్టాల్ చేసి, ఆపై మీ KYC ని పూర్తి చేయడానికి మీ ఆధార్‌ను అప్డేట్ చేయడానికి ముందుకు సాగాలని అభ్యర్థిస్తున్నాము. చివరలో SBI KYC AADHAAR UPDATE.apk ఫైల్ ఉంది.
తమ కస్టమర్లు APK ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతూ ఇలాంటి సందేశాలను ఎప్పుడూ ఉపయోగించబోమని SBI స్పష్టం చేసింది. కస్టమర్లు ఈ సందేశాలకు బయపడి APK ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకుంటే, వారి మొత్తం ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి, కస్టమర్లు అలాంటి సందేశాల ద్వారా వచ్చే ఫైల్స్‌ను ఎప్పుడూ డౌన్లోడ్ చేసుకోకూడదు. వారు వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి, సంఘటనను బ్యాంక్ అధికారులకు తెలిపాలని కోరింది.
Also Read:Top Headlines @5PM : టాప్ న్యూస్
ఒక కస్టమర్ అనుకోకుండా ఈ ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకుని తమ ఖాతా నుండి డబ్బు పోగొట్టుకుంటే, వెంటనే సైబర్ మోసం హెల్ప్‌లైన్ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని SBI సూచించింది. మీరు cybercrime.gov.in వద్ద ఉన్న నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
-
Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
-
OTR: కేటీఆర్ సభ రద్దు వెనుక అసలు కారణమేంటి..? BRSలో హాట్ టాపిక్..
-
Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
-
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!