India vs Pakistan: నష్టపరిహారం, సస్పెన్షన్.. పీసీబీ, ఐసీసీ మీటింగ్ లేటెస్ట్ డీటెయిల్స్ ఇవే!
- ఫిబ్రవరి 15న భారత్, పాకిస్థాన్ మ్యాచ్
- మ్యాచ్‌ను నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న ఐసీసీ
- నష్టపరిహారం, సస్పెన్షన్ అంటూ ఐసీసీ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC Warns PCB Over Match Boycott vs India: టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్‌తో ఫిబ్రవరి 15న జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ పభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను ఎలాగైనా నిర్వహించాలని ఐసీసీ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో ఐసీసీ సంప్రదింపులు జరుపుతోంది. లాహోర్‌లో ఆదివారం పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ, ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం సమావేశమయ్యారు. ఐదు గంటలకు పైగా చర్చలు సాగినట్లు తెలుస్తోంది. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించే ఆలోచనపై స్ఫష్టమైన వివరణ ఇవ్వాలని పీసీబీని ఐసీసీ ఆదేశించినట్లు సమాచారం. అదే సమయంలో పీసీబీ హెచ్చరించిందట.
భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తే.. మ్యాచ్ కారణంగా ఐసీసీకి కలిగే ఆర్థిక నష్టాన్ని పాకిస్థాన్ నుంచి వసూలు చేసే హక్కు తమకు ఉందని పీసీబీకి ఐసీసీ గుర్తు చేసిందట. భారత్ మ్యాచ్‌లకు సంబంధించిన బ్రాడ్‌కాస్టింగ్, స్పాన్సర్‌షిప్, డిజిటల్ వ్యూస్ వంటి అంశాల్లో వచ్చే భారీ ఆదాయం దృష్ట్యా ఈ నష్టం భారీగా ఉండొచ్చని ఐసీసీ సూచించింది. తాము ఎలాంటి వివాదాలకు వెళ్లాలనుకోవడం లేదని కూడా పీసీబీకి ఐసీసీ తెలిపింది. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలన్నదే తమ మొదటి ప్రాధాన్యమని పేర్కొంది.
Also Read
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
- Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
- Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
Also Read: India vs Pakistan: వాటా, సిరీస్‌లు, హ్యాండ్‌షేక్.. పాకిస్థాన్ డిమాండ్స్ ఇవే!
ఒకవేళ భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని పీసీబీకి ఐసీసీ వార్నింగ్ ఇచ్చిందట. సస్పెన్షన్ లేదా సభ్యత్వ రద్దు లాంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని హెచ్చరించింది. ఈ పరిణామాలతో భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ మరింత పెరిగింది. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ఆదరణ పొందిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌పై తీసుకునే నిర్ణయం.. పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టీ పీసీబీ ఐసీసీకి ఎలాంటి వివరణ ఇస్తుంది? అనే దానిపై ఉంది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!