Social Media Ban for Children Below 16: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం..! సీఎం కీలక ఆదేశాలు
- 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకం నిషేధంపై ఏపీ సర్కార్ కసరత్తు..
- అధ్యయనం చేయాలని పోలీస్‌శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశం..
- విచ్చలవిడితనానికి బ్రేకులు వేయాల్సిందేనన్న సీఎం..
- ఎవరు వ్యక్తిత్వ హననానికి పాల్పడినా వదిలిపెట్టొద్దని ఆదేశం..
- అవసరమైతే ప్రత్యేకమైన చట్టం తెస్తామన్న చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Social Media Ban for Children Below 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది.. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ విషయంలో సమగ్రంగా అధ్యయనం చేయాలని పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు, యువతపై ప్రతికూల ప్రభావాలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా విచ్చలవిడితనానికి బ్రేకులు వేయాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. చిన్నారుల మానసిక ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: Tamarind Pulihora Recipe: అచ్చం గుడిలో పెట్టె ప్రసాదంలా ఉండే చింతపండు పులిహోర.. చేసేయండి ఇలా!
Also Read
- TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్‌షాప్
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
ఇక, సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఈ అంశంపై ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించాలని సీఎం సూచించారు. 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై అధ్యయనం చేయాలి.. వరుసగా అవగాహనా సదస్సులు నిర్వహించాలి.. తల్లిదండ్రులు, విద్యార్థులకు సోషల్ మీడియా ప్రమాదాలపై అవగాహన కల్పించాలి.. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు స్పష్టమైన యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశించారు. చట్టపరమైన అంశాలు, సాంకేతిక పరిష్కారాలు, అవగాహనా కార్యక్రమాలు అన్నింటినీ కలిపిన సమగ్ర ప్రణాళిక ఉండాలని సూచించారు. పిల్లల భద్రత, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Igho Ubiribo: ప్రైవేట్ పార్ట్ పరిమాణం పెంచే కాస్మెటిక్ ప్రక్రియ చివరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాన్ని ఎలా తీసింది?
-
2026 Tollywood : ఫేడౌట్ హీరోలకు కలిసివచ్చిన 2026.. వరుస ప్లాపుల తర్వాత దక్కిన ఊరట!
-
Mercedes-AMG Petronas e-Bike: 100KM రేంజ్.. 9 గేర్లు.. Mercedes కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్, ధర చూస్తే షాక్!
-
Epic: తమ్ముడి కోసం రంగంలోకి విజయ్ దేవరకొండ.. ‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రౌడీ హీరో?
-
Car Sales in August: పెట్రోల్ కార్ల వాటా రికార్డు స్థాయిలో పతనం.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!