1,200 నిట్స్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్తో రేపే Oppo K14x 5G లాంచ్..
- రేపే OPPO K14x లాంచ్..
- 50 మెగాపిక్సెల్ AI కెమెరా, 6,500mAh భారీ బ్యాటరీ వంటి కీలక ఫీచర్లు..
- OPPO K సిరీస్‌లో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయనున్న కంపెనీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oppo K14x 5G: OPPO తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ OPPO K14xను రేపు (ఫిబ్రవరి 10) భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఇది గతేడాది వచ్చిన OPPO K13x కు వారసుడిగా లాంచ్ అవుతోంది. ఇప్పటికే కంపెనీ ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ AI కెమెరా, 6,500mAh భారీ బ్యాటరీ వంటి కీలక ఫీచర్లు అందిస్తున్నట్లు నిర్ధారించింది. ఇదిలా ఉండగా, OPPO K సిరీస్‌లో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా త్వరలో విడుదల చేయడానికి కంపెనీ సిద్ధమవుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అది OPPO K14. ఇది K14x కంటే కొద్దిగా ఖరీదైన వేరియంట్‌గా, అలాగే OPPO K13కి వారసుడిగా మార్కెట్లోకి రానుంది. OPPO K14x, OPPO K14- ఈ రెండు ఫోన్లు కూడా భారత మార్కెట్లో రూ.20,000లోపు ధర విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లుగా కంపెనీ తీసుకు వస్తుంది.
Read Also: Stock Market: అమెరికాతో డీల్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో సూచీలు
Also Read
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
- HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు
- రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
Bluetooth SIGలో Oppo K14 5G లిస్టింగ్
ఇప్పటి వరకు ప్రకటించని ఒప్పో స్మార్ట్‌ఫోన్ ఒకటి Bluetooth SIG (Special Interest Group) వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చింది. CPH2869 అనే మోడల్ నంబర్‌తో లిస్టైన ఈ ఫోన్ పేరు Oppo K14 5Gగా లిస్టింగ్ అయింది. Bluetooth SIG సర్టిఫికేషన్ సాధారణంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి త్వరలో ప్రవేశించబోతున్న ఉత్పత్తులకు లభిస్తుంది. బ్లూటూత్ టెక్నాలజీ ఉపయోగించే అన్ని పరికరాలకు ఇది తప్పనిసరి సర్టిఫికేషన్.. ఇది పరికరాల అనుకూలత (interoperability), సాంకేతిక ప్రమాణాలను నిర్ధారిస్తుంది. అయితే, ఈ లిస్టింగ్‌లో ఫోన్ డిజైన్ లేదా పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు. గతంలో ఈ Oppo K14 5G ఫోన్ సింగపూర్‌కు చెందిన IMDA (Infocomm Media Development Authority) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కూడా కనిపించింది. ఒప్పో K14 5G, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Oppo K13 5Gకి వారసుడిగా (successor) లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Oppo K13 5G స్పెసిఫికేషన్లు:
Oppo K13 5G స్మార్ట్‌ఫోన్ Android 15 ఆధారిత ColorOS 15 పై పనిచేస్తుంది.
* 6.7 అంగుళాల Full HD+ AMOLED డిస్ప్ ప్లే
* 120Hz రిఫ్రెష్ రేట్
* 1,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్
* Snapdragon 6 Gen 4 ప్రాసెసర్
* 8GB RAM
* 256GB వరకు స్టోరేజ్
Read Also: India vs Pakistan: వాటా, సిరీస్‌లు, హ్యాండ్‌షేక్.. పాకిస్థాన్ డిమాండ్స్ ఇవే!
కెమెరా:
* వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
* 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్
* ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
కనెక్టివిటీ:
* Wi-Fi
* Bluetooth
* IR బ్లాస్టర్
* డ్యువల్ స్టీరియో స్పీకర్లు
భద్రత:
* ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
* IP65 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్
బ్యాటరీ:
* 7,000mAh భారీ బ్యాటరీ
* 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!