Cyber Crime: రూ.5 వేల కోట్ల ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్.. ఆన్‌లైన్ గేమింగ్, ఫిన్‌టెక్ కంపెనీల ముసుగులో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: రోజురోజుకు సైబర్ నేరాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు.. వైట్ కాలర్ నేరస్తుల తరహాలో స్మార్ట్‌గా దోచేస్తున్నారు. అలాంటి ఓ స్కామ్‌ను హైదరాబాద్ DGGI అధికారులు బయట పెట్టారు. దీంతో రూ.5 వేల కోట్ల భారీ ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్ బయటపడింది. మరోవైపు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి తెలంగాణలో ఇద్దురు యువకులు బలయ్యారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న భారీ ఆర్థిక మోసాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ .. DGGI హైదరాబాద్ జోనల్ అధికారులు వెలుగులోకి తెచ్చారు. ఆన్‌లైన్ గేమింగ్, ఫిన్‌టెక్ కంపెనీల ముసుగులో సుమారు రూ.5 వేల కోట్ల విలువైన అక్రమ లావాదేవీలు జరిపిన ఓ భారీ సిండికేట్‌ను గుర్తించి.. కీలక ఆధారాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రియల్ మనీ, ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లను నిర్వహిస్తూ, వాటి ద్వారా వచ్చిన భారీ మొత్తాన్ని డొల్ల కంపెనీలు, ఫిన్‌టెక్ సంస్థలు, అద్దెకు తీసుకున్న బ్యాంకు ఖాతాల ద్వారా దేశవిదేశాలకు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
Tamarind Pulihora Recipe: అచ్చం గుడిలో పెట్టె ప్రసాదంలా ఉండే చింతపండు పులిహోర.. చేసేయండి ఇలా!
ఈ అక్రమ దందాకు దేశవ్యాప్తంగా విస్తృత నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు DGGI అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై నగరాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సిండికేట్ కార్యకలాపాలు పలు రాష్ట్రాలకు విస్తరించి ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ముంబైకి చెందిన వై.ఎస్. ప్రభు కుమార్, హైదరాబాద్‌కు చెందిన రాజశేఖర్ రెడ్డిని ప్రధాన సూత్రధారులుగా అధికారులు గుర్తించారు. వీరు ఆన్‌లైన్ గేమింగ్, ఫిన్‌టెక్ సంస్థల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తూ, అక్రమ లావాదేవీలకు మార్గనిర్దేశనం చేసినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా విదేశాల నుంచి, ముఖ్యంగా దుబాయ్ కేంద్రంగా వ్యవహారాన్ని నడిపిస్తున్న వ్యక్తి ఒకరు ఉన్నట్లు కూడా అధికారులు అనుమానిస్తున్నారు.
ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్‌పై చెల్లించాల్సిన జీఎస్టీని ఎగ్గొట్టేందుకు ప్రత్యేకంగా పేఔట్ ఎస్క్రో ఖాతాలు సృష్టించి, అధికారుల నిఘాకు చిక్కకుండా లావాదేవీలు నిర్వహించినట్లు DGGI గుర్తించింది. షెల్ కంపెనీల పేరుతో కోట్లాది రూపాయల లావాదేవీలు జరిపి ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించినట్లు అంచనా వేస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని, ఏపీఐ ఆధారిత బల్క్ ట్రాన్సాక్షన్ విధానాలను దుర్వినియోగం చేసినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా జీతాలు, వెండార్ చెల్లింపుల కోసం ఉపయోగించే ఈ విధానాన్ని అక్రమ డబ్బు తరలింపుకు వాడటంతో.. ఓటీపీ లేదా మాన్యువల్ వెరిఫికేషన్ లేకుండానే కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ భారీ స్కామ్‌పై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, GST ఎగవేత, అక్రమ మనీ ట్రయల్, విదేశీ లావాదేవీల వంటి అంశాలపై లోతుగా విచారణ చేపట్టినట్లు DGGI విజిలెన్స్ అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని కీలక వివరాలు, మరిన్ని నిందితుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు సైబర్ నేరగాళ్ల వేధింపులతో కోరం రామారావు అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కోరం రామారావు ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్స్ మూడు రోజులుగా అతడిని వేధింపులకు గురి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన పురుగుల మందు తాగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. రామారావు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఎఫ్ఎస్‌ఎల్‌కు పంపించి సైబర్ నేరగాళ్ల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.
బలవన్మరణానికి ముందు రామారావు పోలీసులకు ఒక లేఖ రాశాడు. అందులో సైబర్ క్రిమినల్స్ తనను ఏ విధంగా వేధించింది తెలిపాడు. సైబర్ క్రిమినల్స్ తన ఫోన్ ను హ్యాక్ చేశారని, డేటా మొత్తం సేకరించారని తెలిపాడు. వారి వేధింపులు భరించలేకపోయినట్లు అందులో తెలిపాడు. తన కుటుంబసభ్యులను కాపాడాలని లేఖలో పోలీసులను వేడుకున్నాడు. తన పోరువు పోతుందనే భయంతో బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు లేఖలో తెలిపాడు. పురుగుల మందు తాగిన రామారావును కుటుంబసభ్యులు వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రామారావు చనిపోయాడు. దీనిపై మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
IND vs PAK: దెబ్బ అదుర్స్ కదూ.. PCB డిమాండ్లను తిరస్కరించిన ICC! భారత్-పాక్ మ్యాచ్ ఇక లేనట్టే!
మరోవైపు క్రిప్టో కరెన్సీ లావాదేవీలు హైదరాబాద్ పాతబస్తీలో ఓ యువకుడి ప్రాణాలు తీశాయి. పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలు హృదయవిదారకంగా ఉన్నాయి. హైదరాబాద్ పాతబస్తీలో మహమ్మద్ ఔన్ ఖాన్ అనే యువకుడు నివసిస్తున్నాడు. అతనికి ఆస్ట్రేలియాలో జాన్ అనే స్నేహితుడు ఉన్నాడు. ఈ క్రమంలో జాన్‌కు భారీ మొత్తంలో క్రిప్టో కరెన్సీని ఔన్ ఖాన్ బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఎన్నో ఏళ్ల స్నేహబంధం కారణంగా అతనిపై పూర్తిగా నమ్మకం ఉంచిన ఔన్ ఖాన్, ఆస్ట్రేలియాలో కలిసిన సమయంలో జాన్ చెప్పిన మాటలను నిజమని నమ్మాడు. క్రిప్టో కరెన్సీ తన ఖాతాకు బదిలీ చేస్తే, హైదరాబాద్‌లో 1.5 కోట్ల భారతీయ కరెన్సీని ఏర్పాటు చేస్తానని జాన్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. స్నేహం అనే బంధమే ఆధారంగా, ఎలాంటి అనుమానం లేకుండా ఔన్ ఖాన్ తన సంపాదనను అతడికి అప్పగించాడు. కానీ క్రిప్టో అందుకున్న వెంటనే జాన్ తన చిరునామా మార్చుకొని, సంప్రదింపులకు దూరమయ్యాడు.
కొన్ని రోజుల ఎదురుచూపుల అనంతరం తాను మోసపోయానని గ్రహించిన ఔన్ ఖాన్, దాదాపు కోటిన్నర రూపాయల నష్టంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. కష్టపడి సంపాదించిన డబ్బు కళ్లముందే చేజారిపోవడంతో మనస్తాపం చెంది విషం తాది ఆత్మహత్య చేసుకున్నాడు.
తాజావార్తలు
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!