Supreme Court: ‘మియాన్ ముస్లిం’ వంటి రెచ్చగొట్టే ప్రకటనలను నిషేధించాలి.. యోగి సహా బీజేపీ సీఎంలపై సుప్రీంకోర్టులో పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: మియా ముస్లిం’, ‘కథా ముల్లా’, ‘వరద జిహాద్’ వంటి రెచ్చగొట్టే, విభజనాత్మక పదాలను బహిరంగ వేదికలపై ఉపయోగించడాన్ని నిషేధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సహా పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు, నేతల వ్యాఖ్యలపై ఈ పిటిషన్ దాఖలైంది.
Read Also: NTR – Prashanth Neel’s : రూటు మార్చిన ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ కోసం స్పెషల్ మేకోవర్
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఇలాంటి పదాలను ఉపయోగించడం రాజ్యాంగ పదవులు నిర్వహిస్తున్న వ్యక్తుల బాధ్యతలకు విరుద్ధమని, ఇది సమాజంలో విభజన, భయం, ఉద్రిక్తతలను పెంచుతోందని ఆరోపించారు. ముఖ్యంగా మతపరమైన సమూహాలను లక్ష్యంగా చేసుకుని చేసే వ్యాఖ్యలు సామాజిక సమరసతకు ముప్పుగా మారుతున్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ చేసిన ‘మియా ముస్లిం’, ‘వరద జిహాద్’ వ్యాఖ్యలు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉపయోగించిన ‘కథా ముల్లా’ పదం, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, బీజేపీ నేత నితేష్ రాణే ముస్లింలను “పాకిస్తానీ పింప్స్”గా సంబోధించిన వ్యాఖ్యలను పిటిషనర్లు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ పిటిషన్‌లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చేసిన ఒక వ్యాఖ్యను కూడా ప్రస్తావించారు. చరిత్రపై ప్రతీకారం తీర్చుకునేలా యువతను ప్రేరేపించే వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని పెంచుతాయని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, సామాజిక కార్యకర్తలు జాన్ దయాల్, రూప్ రేఖ వర్మ సహా మొత్తం 12 మంది సామాజిక కార్యకర్తలు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు విభజనాత్మక వ్యాఖ్యలు చేయకుండా నిరోధించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని వారు సుప్రీంకోర్టును కోరారు. అలాగే, ఓటరు జాబితాల నుంచి మతపరమైన సమాజాలకు చెందిన వారిని తొలగించాలనే డిమాండ్లు రాజ్యాంగ విరుద్ధమని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!