Jowar Roti with Red Chilli: ఎర్ర కారంతో జొన్న రొట్టె తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jowar Roti with Red Chilli: భారతీయ సంప్రదాయ ఆహారాల్లో జొన్న రొట్టె- ఎర్ర కారం కాంబినేషన్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేసే ఆహారం అని చెప్పాలి. ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ కాంబినేషన్ మన శరీరానికి సంపూర్ణ పోషణను అందజేస్తుంది. ముఖ్యంగా మధుమేహం నియంత్రణ, బరువు తగ్గడం, జీర్ణక్రియ మెరుగుదల లాంటి అనేక ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి.
Read Also: Blood Fall: మంచు కొండల నుంచి కారుతున్న రక్తం.. ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రకృతి రహస్యం!
Also Read
- Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్‌గా మార్చేసే సింపుల్ ట్రిక్
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్..!
- Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
జొన్న రొట్టె ప్రయోజనాలు:
జొన్న రొట్టెలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. జొన్నల్లో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అధిక ఫైబర్ ఉండటంతో ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండి, అనవసరంగా తినాలనే కోరిక తగ్గిపోతుంది. దీంతో బరువు తగ్గడంలో బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా జొన్న రొట్టె కీ రోల్ పోషిస్తుంది. ఇందులోని ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించి పేగుల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా, జొన్నల్లో ఉండే ఖనిజాలు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుంది. కాల్షియం, ఫాస్పరస్ లాంటి పోషకాలు ఎముకలను బలంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. గ్లూటెన్ లేని ధాన్యం కావడంతో గోధుమలు పడని వారికి ఇది చాలా బెటర్.
Read Also: Nuclear Deal: అణు యుద్ధం వస్తుంది..!? అగ్రదేశాల డీల్ ముగియడంతో భయం గుప్పిట్లో ప్రపంచం!
ఎర్ర కారం ప్రయోజనాలు:
ఎర్ర కారంలో ఉండే క్యాప్సైసిన్ అనే పదార్థం శరీరంలోని మెటబాలిజాన్ని తొందరగా తగ్గిస్తుంది. దీంతో క్యాలరీలు త్వరగా కరిగిపోతాయి. ఇది ఆకలిని పెంచడమే కాకుండా, జీర్ణరసాల స్రవణను ప్రేరేపించి జీర్ణక్రియకు హెల్ప్ చేస్తుంది. సరైన మోతాదులో తీసుకుంటే ఇది శరీరానికి శక్తినీ అందజేస్తుంది.
Read Also: Calcium Rich Ladoo : ఎముకల బలానికి ‘కాల్షియం లడ్డు’.. కేవలం 90 క్యాలరీలతో ఇంట్లోనే ఇలా చేసుకోండి!
కలిగే లాభాలు:
జొన్న రొట్టె- ఎర్ర కారంతో కలిపి తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి దొరుకుతుంది. పోషకాహార లోపాన్ని తగ్గించడంలో ఇది సాయం చేస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంటాయి. గ్రామీణ జీవనశైలిలో ఇది తక్షణ శక్తినిచ్చే ప్రధాన ఆహారంగా ఉండటానికి ఇదే కారణం. అయితే, ఎర్ర కారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ ఎక్కువగా తీసుకోవడం వలన కడుపులో మంట, అసౌకర్యం కలిగే ఛాన్స్ ఉంది. కాబట్టి, లిమిట్ లో తీసుకుంటే జొన్న రొట్టె- ఎర్ర కారం కాంబినేషన్ మీ ఆరోగ్యానికి నిజంగా ఓ వరం అని చెప్పాలి.
తాజావార్తలు
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
-
APFDC: సినిమా షూటింగ్స్‌కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్‌గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!