జొన్నల్లో పిండి శాతం ఎక్కువ. రొట్టెను తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. తక్కువ తీసుకున్నా పొట్ట నిండిపోతుంది. 

జొన్నల్లో ఉండే అమినో ఆమ్లాలు అధికశాతం ప్రోటీన్లను శరీరానికి అందిస్తాయి. 

జొన్నల్లో పీచు ఉంటుంది. వాటితో చేసిన పదార్థాలు తేలిగ్గా జీర్ణమవుతాయి.

జొన్నల్లోని పోషకాలు మూత్రాశయంలో రాళ్లు ఏర్పడకుండా కాపాడతాయి. 

జొన్నల్లో నియాసిన్ ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది. 

జొన్నల్లోని ఫైటోనూట్రియంట్లు గుండె జబ్బుల్ని దూరంగా వుంచుతాయి. 

జొన్నల్లో పొటాషియం, మెగ్నీషియం, మినరళ్లు ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

నూనె లేకుండా జొన్న రొట్టెలు కాల్చి తింటే.. ఇనుమ సమృద్ధిగా అందుతుంది. రక్తహీనత వున్నవారు ఈ రొట్టెను తింటే బెటర్.

మెనోపాజ్ దశకు ముందు జొన్నలతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆ తర్వాత వచ్చే హార్మోన్ల అసమతుల్యత ఇబ్బంది పెట్టదు. 

జొన్న పదార్థాలను తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ అదుపులో వుంటుంది.