Sergio Gor-Piyush Goyal: సుంకాలు జీరో చేసుంటే క్రికెట్ మ్యాచ్ అమెరికానే గెలిచేది.. విందులో గోయల్ నవ్వులు.. పువ్వులు
- ఢిల్లీలో సెర్గియో గోర్ విందు
- క్రికెట్ మ్యాచ్‌పై పియూష్ గోయల్ కామెడీ
- నవ్వుకున్న సెర్గియో గోర్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా రాయబారి సెర్గియో గోర్-కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ మధ్య ఆసక్తికర సంభాషణ నవ్వులు-పువ్వులు పూయించాయి. సెర్గియో గోర్ సోమవారం సాయంత్రం తన నివాసంలో గ్రాండ్‌గా విందు ఇచ్చారు. వ్యాపార, రాజకీయ ప్రముఖులతో పాటు 75 మంది ఆయా దేశాలకు చెందిన దౌత్యవేత్తలు హాజరయ్యారు. ఈ విందుకు కేంద్రమంత్రులు పియూష్ గోయల్, జైశంకర్ పాల్గొన్నారు.

Also Read
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
ఈ సందర్భంగా సెర్గియో గోర్-పియూష్ గోయల్ మధ్య ఇంట్రెస్టింగ్ సంభాషణ జరిగింది. ఫిబ్రవరి 7న టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ముంబై వాంఖేడ్ స్టేడియంలో భారత్-అమెరికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో అమెరికా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో అమెరికా పసికూన అయినా అద్భుతంగా పోరాడింది.

ఈ సందర్భంగా పియూష్ గోయల్ క్రికెట్ మ్యాచ్‌ను జ్ఞాపకం చేశారు. ‘‘భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అమెరికా గెలవకపోవచ్చు. కానీ క్రికెట్ గురించి అంతగా అనుభవం లేకపోయినా…. చాలా సంవత్సరాల తర్వాత క్రికెట్‌పై దృష్టి పెట్టి.. దేశం కోసం చాలా అద్భుతమైన ప్రదర్శన చేసిందని కొనియాడారు. సెర్గియో గోర్ కూడా స్వయంగా మ్యాచ్‌ను ఆస్వాదించారని.. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారని గుర్తుచేశారు. యూఎస్ 18 శాతం తేడాతో మ్యాచ్ ఓడిపోయిందని అన్నారని జ్ఞాపకం చేశారు. ఈ సందర్భంగా వినయంగా అభ్యర్థన చేస్తున్నాను.. మీరు పరస్పర సుంకాన్ని జీరో చేసి ఉంటే క్రికెట్ మ్యాచ్ మీరే గెలిచి ఉండేవారు. అయినా కూడా యూఎస్ క్రికెట్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చూసిందని.. నేను నిజంగా ఆశ్చర్యపోయాను.’’ అని గోయల్ అన్నారు. దీంతో ఒక్కసారిగా సెర్గియో గోర్-గోయల్ ఇద్దరూ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
#WATCH | Delhi: "…The US may not have won yesterday's match (against India in the T20 World Cup), but I must say, for a country which has not known Cricket and has started on Cricket a few years ago, the performance was fabulous. Sergio was there to enjoy the match…Sergio… pic.twitter.com/bmwimEor1u
— ANI (@ANI) February 9, 2026
తాజావార్తలు
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
-
Explainer: విదేశీ పేదోళ్ల ముందు.. మన ధనికులు కూడా వేస్ట్!
-
Vaibhav Sooryavanshi: “ఇది నిరంకుశత్వం”.. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!