Gautam Gambhir: సూర్య కుమార్ ఓ అద్భుతమైన కెప్టెన్.. హెడ్ కోచ్ గంభీర్ ప్రశంసలు..
- భారత టీ20 కెప్టెన్ సూర్యపై కోచ్ గంభీర్ ప్రశంసలు..
- టీ20 ఫార్మాట్‌లో సారథిగా సూర్యకుమార్ అదరగొడుతున్నారు..
- స్టేడియంలో ప్రశాంతంగా కనిపిస్తూ.. తోటి ఆటగాళ్లకు మద్దతుగా ఉంటాడు: గంభీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir: భారత టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌పై జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆటగాడిగా కొన్నిసార్లు తప్పులు చేయొచ్చని పేర్కొన్న గంభీర్.. కెప్టెన్సీ పరంగా మాత్రం సూర్య అన్ని విభాగాల్లో సమర్థుడని తేల్చి చెప్పాడు. భారత టీ20 జట్టును స్కై నడిపిస్తున్న విధానం అద్భుతంగా ఉందన్నారు. బ్యాటర్‌గా తనదైన షాట్లతో విధ్వంసం సృష్టించే సూర్య.. ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకు సారథిగా కూడా అదరగొడుతున్నాడు. అలాగే, సహచర ప్లేయర్స్ తో మంచి సంబంధాలను కూడా కలిగి ఉంటాడు.. వారితో మంచిగా కమ్యూనికేట్ చేస్తాడు.. స్టేడియంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ తోటి ఆటగాళ్లకు పూర్తిగా సపోర్టు ఇస్తాడని తెలియజేశాడు. సూర్యకుమార్ జట్టు వాతావరణాన్ని చాలా ప్రశాంతంగా ఉంచడమే కాకుండా.. కోచ్‌గా నా పనిని మరింత ఈజీ చేస్తున్నాడు అని గంభీర్ పేర్కొన్నాడు.
Read Also: BCCI Recruitment 2026: 10 కోచింగ్ పోస్టులు.. దరఖాస్తులకు బీసీసీఐ ఆహ్వానం!
Also Read
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ కొడుకు రఫా రఫా.. 100 బంతుల్లో 151 పరుగులతో విధ్వంసం..
- Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
- Team India: ఐదు వన్డేలు, ఇద్దరు కెప్టెన్లు.. ఆకాష్ దీప్ రీఎంట్రీ.. జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం!
- Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
అలాగే, ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ కొన్ని సందర్భాల్లో తప్పులు చేయొచ్చు.. కానీ కెప్టెన్‌గా మాత్రం అన్ని విభాగాల్లో సమర్థంగా ముందుకు సాగుతున్నాడని కోచ్ గంభీర్ తెలిపారు. అలాంటి వ్యక్తి భారత జట్టును నడిపించడం గొప్ప విషయమని చెప్పాడు. జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని పేర్కొన్నారు. ఇక, టీ20 ప్రపంచకప్‌లో భాగంగా యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 29 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో సూర్య కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 84 పరుగులు చేసి భారత్‌ను బరిలో నిలిపాడు. భారత్ ఒక దశలో కేవలం 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టా్ల్లో పడింది. అయితే, ఒక వైపు వికెట్లు పడుతున్నప్పటికీ.. సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. అమెరికా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 161/9 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో యూఎస్‌ఏ 132/8కే పరిమితమైంది.
తాజావార్తలు
-
Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
-
Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ కొడుకు రఫా రఫా.. 100 బంతుల్లో 151 పరుగులతో విధ్వంసం..
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Team India: ఐదు వన్డేలు, ఇద్దరు కెప్టెన్లు.. ఆకాష్ దీప్ రీఎంట్రీ.. జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!