Punjab: వాలెంటైన్స్ డేకు ముందు తరగతి గదిలో రక్తపాతం.. క్లాస్‌మేట్‌ను ఎందుకు చంపాడంటే..!
- పంజాబ్ లా కాలేజీలో ఘోరం
- వాలెంటైన్స్ డేకు ముందు తరగతి గదిలో రక్తపాతం
- సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి మనిషి ఎదుగుదలలో అనేక దశలు ఉంటాయి. శిశువు.. బాల్యం.. యవ్వనం, మధ్య వయసు, వృద్ధాప్యం.. ఇలా ఆయా దశలుంటాయి. వీటిన్నింటిలో అత్యంత ప్రమాదర వయసు కౌమారదశ. ఈ వయసులో పుట్టె కోర్కెలు మానసిక స్థిరత్వం లేకుండా ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లి గజిబిజి చేస్తుంది. జాగ్రత్తగా ఈ స్టేజ్ దాటితో జీవితం సాఫీగా పోతుంది. లేదంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కొందరు పిల్లలు యవ్వనదశలో తప్పుడు అడుగులు వేసి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకుంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.

Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
పంజాబ్‌లోని తర్న్ తరన్ జిల్లాలో ఉన్న ‘లా’ కాలేజీ. సోమవారం ఉదయం అప్పుడే విద్యార్థులంతా క్లాస్‌రూమ్‌లోకి వస్తున్నారు. ఇంతలోనే ఒక విద్యార్థి.. సహచర విద్యార్థినికి లవ్ ప్రపోజ్ చేశాడు. అందుకు ఆమె నిరాకరించింది. అప్పటికే తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో ఆమెను కాల్చి చంపి.. అనంతరం తనకు తానుగా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కసారిగా పాఠాలు నేర్చుకుని గది రక్తపాతంతో నిండిపోయింది. ఈ ఘటనతో సహచర విద్యార్థులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే రెండు విద్యాకుసుమాలు నేలరాలిపోయాయి. క్యాంపస్ అంతా భయాందోళనకు గురైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
అసలేం జరిగింది..
సీసీకెమెరా రికార్డ్ ప్రకారం.. సోమవారం ఉదయం 9:16 నిమిషాలకు 20 ఏళ్ల ప్రిన్స్ రాజ్ నీలిరంగు బ్యాక్‌ప్యాక్‌తో తరగతిలోకి ప్రవేశించాడు. అప్పటికే తరగతి గదిలో 19 ఏళ్ల సందీప్ కౌర్ తన స్నేహితురాలితో మాట్లాడుతోంది. ప్రిన్స్.. సందీప్ కౌర్ దగ్గరకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేశాడు. యథావిధిగా సందీప్ కౌర్ తన సీటు దగ్గరకు వెళ్లి కూర్చుంది. మరోసారి ప్రిన్స్.. సందీప్ కౌర్‌తో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె మాట్లాడేందుకు నిరాకరించింది. దీంతో కోపోద్రేకుడైన ప్రిన్స్ జేబులోంచి పిస్టల్ తీసి తలపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చాడు.. అక్కడికక్కడే సందీప్ కౌర్ కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలింది. అనంతరం నిందితుడు ప్రిన్స్ కూడా తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సెకన్ల వ్యవధిలోనే రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కేవలం 10 సెకన్లలోపే అంతా జరిగిపోయింది. ఈ ఘటనతో సహచర విద్యార్థులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఫిబ్రవరి 8న ప్రిన్స్.. సందీప్ కౌర్‌కు ఫోన్ చేసి ప్రేమ ప్రపోజ్ చేశాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో కోపం, పగతో రగిలిపోయిన ప్రిన్స్.. తన తండ్రికి సంబంధించిన లైసెన్స్ తుపాకీ తీసుకొచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

గతేడాది నుంచి సందీప్ కౌర్‌ను ప్రిన్స్ వెంబడిస్తున్నాడు. మొదటి నుంచి అతడి ప్రేమను తిరస్కరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల సందీప్ కౌర్ కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూశారు. నిశ్చితార్థానికి సిద్ధపడుతున్నారు. ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సందీప్ కౌర్ తండ్రి చనిపోయారు. ఆరుగురు సోదరీమణులు, ఒక సోదరుడితో నివాసం ఉంటుంది. న్యాయవాది వృత్తి ద్వారా తన తల్లికి అండగా ఉండాలని సందీప్ కౌర్ భావించింది. కానీ సహచర విద్యార్థి చేతిలోనే ప్రాణాలు కోల్పోతానని ఊహించలేకపోయింది.
ఇక తరగతి గదిలో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. బ్యాగ్ పరిశీలించకుండా ఎలా పంపించారని ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!