Ramayana: ‘రామాయణ’లో విజయ్ సేతుపతి? పుకార్లపై క్లారిటీ ఇచ్చిన మక్కల్ సెల్వన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక గాథ ‘రామాయణ’ గురించి, ప్రతిరోజూ ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఈ సినిమాలో తారాగణం విషయంలో రోజుకో కొత్త పేరు వినిపిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ముఖ్యంగా రావణుడి తమ్ముడు ‘విభీషణుడి’ పాత్రలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించబోతున్నారని గత కొన్నాళ్లుగా గట్టి ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలపై విజయ్ సేతుపతి స్వయంగా స్పందిస్తూ అసలు నిజం వెల్లడించారు.
Also Read : Pawan Kalyan: ‘ఫౌజీ’ భామకు డబుల్ జాక్‌పాట్.. ఏకంగా పవన్ కళ్యాణ్‌తో ఛాన్స్ !
Also Read
తాను ‘రామాయణ’ ప్రాజెక్టులో లేనని విజయ్ సేతుపతి స్పష్టం చేశారు.. ‘నేను ఈ సినిమాలో నటించడం లేదు. అసలు ఇలాంటి పుకార్లు ఎందుకు వస్తున్నాయో కూడా నాకు అర్థం కావడం లేదు అని ఆయన’ వెల్లడించడంతో విభీషణుడి పాత్రపై ఉన్న సస్పెన్స్‌కు తెరపడింది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల కోసం మేకర్స్ ఇప్పటికే స్టార్ నటీనటులను ఎంపిక చేశారు. రావణుడిగా రాకింగ్ స్టార్ యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. అలాగే మండోదరిగా కాజల్ అగర్వాల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ తమ నటనతో అలరించనున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేసింది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి థియేటర్లలో సందడి చేయనున్నాయి.
తాజావార్తలు
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!