Sergio Gor: ఢిల్లీలో గ్రాండ్‌గా అమెరికా రాయబారి విందు.. హాజరైన రాజకీయ ప్రముఖులు
- ఢిల్లీలో గ్రాండ్‌గా అమెరికా రాయబారి విందు
- హాజరైన వ్యాపార, రాజకీయ ప్రముఖులు
- సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా రాయబారి సెర్గియో గోర్ దేశ రాజధాని ఢిల్లీలో గ్రాండ్‌గా పార్టీ నిర్వహించారు. ఈ విందుకు వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 75 దేశాలకు చెందిన రాయబారులు పాల్గొన్నారు.
ఈ మధ్య భారత్-అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందం తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ప్రధాని మోడీ-అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్ సంభాషణ తర్వాత సంబంధాలు మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం తన నివాసంలో సెర్గియో గోర్ విందు ఇచ్చారు. ఈ విందుకు కేంద్రమంత్రులు పియూష్ గోయల్, జైశంకర్, బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరూన్, యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫిన్ పాల్గొన్నారు.
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
ఇందుకు సంబంధించిన ఫొటోలను సెర్గియో గోర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘ఈరాత్రి నేను భారతదేశంలో ప్రియమైన స్నేహితులు, దౌత్య సమాజం, వ్యాపార, రాజకీయ నాయకులు, యునైటెడ్ స్టేట్స్ భాగస్వాములతో కలిసి ఇంట్లో అద్భుతమైన రిసెప్షన్ నిర్వహించాను. దేశాల మధ్య కొత్త వాణిజ్య ఒప్పందం, లోతైన వ్యూహాత్మక సంబంధాలు బలపడుతున్నాయి.’’ అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా రాయబారులకు పియూష్ గోయల్, జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: Maithili Thakur: అసెంబ్లీలో మైథిలి ఠాకూర్ తొలి స్పీచ్.. ప్రశ్నలతో మంత్రిని ఇరకాటంలో పెట్టిన గాయని
అంతకుముందు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌తో సెర్గియో గోర్ సంభాషించారు. ‘‘ఇది అద్భుతమైన సమావేశం. మీతో కలిసి పనిచేయడానికి నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నాను.’’ అని గోర్ రాశారు. ఈ సందర్భంగా సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీ, సరఫరా గొలుసులను బలోపేతం చేయడంపై చర్చించారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో అమెరికా నుంచి బలమైన భాగస్వామ్యం ఉంటుందని.. దేశాల మధ్య సంబంధాలు మరింత పెంచుతుందని అశ్విని వైష్ణవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Hosted a warm reception at home tonight with dear friends from India, the diplomatic community, business leaders and partners from the US. Amid our nations' renewed trade framework and deepening strategic ties, the real magic happens in these personal moments—where trust, ideas,… pic.twitter.com/4PKa5upV70
— Ambassador Sergio Gor (@USAmbIndia) February 9, 2026
Good meeting with Mr. Sergio Gor, U.S. Ambassador to India.
Discussed strengthening our strategic ties, with a focus on semiconductors, electronics manufacturing and supply chain resilience.
Look forward to strong participation from the U.S. in the AI Impact Summit 2026.
🇮🇳🤝🇺🇸 pic.twitter.com/P8x3Kb2dDI— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 9, 2026
#WATCH | Delhi: "…The US may not have won yesterday's match (against India in the T20 World Cup), but I must say, for a country which has not known Cricket and has started on Cricket a few years ago, the performance was fabulous. Sergio was there to enjoy the match…Sergio… pic.twitter.com/bmwimEor1u
— ANI (@ANI) February 9, 2026
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!