Mohsin Naqvi Trolls: ఒకటే తరహా ప్రకటనలు, పదే పదే యూ టర్న్‌లు.. ‘సీవీ’ అంటూ మోసిన్ నఖ్వీపై ట్రోల్స్!
- అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నఖ్వీ పేరు
- నఖ్వీ వరుస నిర్ణయాలపై సోషల్ మీడియాలో ట్రోల్స్
- 'సీవీ' అంటూ మోసిన్ నఖ్వీపై ట్రోల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోసిన్ నఖ్వీ పేరు ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. భారత్‌కు సంబంధించిన టోర్నీలు, హైబ్రిడ్ మోడల్‌లు, బహిష్కరణ హెచ్చరికలు.. ఇలా నఖ్వీ తీసుకున్న వరుస నిర్ణయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయాపై ట్రోల్స్ మొదలయ్యాయి. ‘సీవీ ఆఫ్ మోసిన్ నఖ్వీ’ అంటూ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రతి ఐసీసీ టోర్నీ ముందు ఒకే తరహా ప్రకటనలు, అదే తరహా హెచ్చరికలను జిత్తుల మారి నక్క నఖ్వీ చేస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి.
ఆసియా కప్ 2023 సందర్భంగా హైబ్రిడ్ మోడల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని మోసిన్ నఖ్వీ స్పష్టం చేశాడు. భారత్‌లో మ్యాచ్‌లు ఆడే ప్రసక్తే లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. ఇదే క్రమంలో వన్డే వరల్డ్‌కప్ 2023కి కూడా భారత్‌కు వెళ్లబోమని పీసీబీ అధికారికంగా ప్రకటించింది. ఐసీసీ రంగంలోకి దిగడంతో నఖ్వీ వెనక్కి తగ్గగ తప్పలేదు. అతడి నిర్ణయాలు క్రికెట్ రాజకీయాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
Also Read
- Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
- Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
- Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
- ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో కూడా హైబ్రిడ్ మోడల్‌ను తిరస్కరిస్తామని మోసిన్ నఖ్వీ మరోసారి కఠిన వైఖరి ప్రదర్శించాడు. భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లపై స్పష్టత లేకుండా టోర్నీలు జరగవని ఆయన చేసిన వ్యాఖ్యలు ఐసీసీపై తీవ్ర ఒత్తిడి పెంచేలా చేశాయి. అదే సమయంలో ఆసియా కప్‌లో అంపైర్ అండి పైక్రాఫ్ట్‌ను తొలగించకపోతే.. టోర్నీనే బహిష్కరిస్తామని హెచ్చరించడం మరో సంచలనంగా మారింది. నఖ్వీ నక్క మారి జిత్తులు ఇక్కడితో ఆగలేదు.
Also Read: T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరించినా.. బంగ్లాదేశ్‌కు ఐసీసీ శుభవార్త!
2026 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను కూడా బహిష్కరిస్తామని పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ హెచ్చరించాడు. ఈ ప్రకటనతో క్రికెట్ ప్రపంచం మరోసారి ఉలిక్కిపడింది. భారత్‌తో మ్యాచ్ ఆడడానికి కొన్ని డిమాండ్స్ కూడా చేశాడు. అయితే ఐసీసీ బ్యాన్ హెచ్చరికల నేపథ్యంలో భారత్‌తో ఆడతాం అని వెన్నక్కి తగ్గాడు. ఇలా నఖ్వీ తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటనలే ఆయన ‘సీవీ’గా మారిపోయాయని సోషల్ మీడియాలో సరదాగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. క్రికెట్ పాలనలో స్థిరమైన నిర్ణయాలే కీలకమని, లేకపోతే ఇలాంటి అపవాదులే మిగులుతాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!