BCCI Recruitment 2026: 10 కోచింగ్ పోస్టులు.. దరఖాస్తులకు బీసీసీఐ ఆహ్వానం!
- బీసీసీఐ మరో కీలక ప్రకటన
- కోచింగ్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం
- నాలుగు విభాగాల్లో 10 ఖాళీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరో కీలక ప్రకటన చేసింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోచింగ్, పెర్ఫార్మెన్స్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. భారత క్రికెట్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో అనుభవజ్ఞులైన నిపుణులను ఎంపిక చేసేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం నాలుగు విభాగాల్లో బీసీసీఐ ఖాళీలను భర్తీ చేయనుంది. బ్యాటింగ్ కోచ్ విభాగంలో రెండు పోస్టులు అందుబాటులో ఉన్నాయి. బ్యాట్స్‌మెన్ టెక్నిక్, ఫామ్, మ్యాచ్ సిచ్యువేషన్లలో ఆటగాళ్లను తీర్చిదిద్దే బాధ్యతలు గల వారు ఈ పోస్టుకు అర్హులు.
ఫాస్ట్ బౌలింగ్ కోచ్ విభాగంలో మూడు పోస్టులకు దరఖాస్తులు బీసీసీఐ అధికారులు స్వీకరిస్తున్నారు. యువ పేసర్లను గుర్తించడం, వారి వేగం, ఫిట్‌నెస్, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం కీలకం. ఫీల్డింగ్ విభాగంలో మొత్తం నాలుగు కోచ్ పోస్టులను బీసీసీఐ ప్రకటించింది. ఇందులో మూడు పురుషులకు, ఒకటి మహిళలకు కేటాయించారు. ఆధునిక క్రికెట్‌లో అత్యంత కీలకమైన ఫీల్డింగ్ స్టాండర్డ్స్‌ను మెరుగుపరచడం, ఆటగాళ్ల అథ్లెటిసిజం పెంపొందించడం ఫీల్డింగ్ కోచ్ ప్రధాన లక్ష్యం. పెర్ఫార్మెన్స్ అనలిస్ట్‌గా ఒక పోస్టు ఖాళీగా ఉంది. మ్యాచ్ డేటా, ఆటగాళ్ల ప్రదర్శన విశ్లేషణ, వ్యూహాత్మక సూచనలతో జట్టు సిద్ధతకు సహకరించడం వీరి ప్రత్యేకత.
Also Read
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
- Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
- Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
Also Read: Apple Watch లవర్స్‌కు పండగే.. ఏకంగా 10% ఫ్లాట్ డిస్కౌంట్.! భయ్యా.. ఈ డీల్‌ను అస్సలు మిస్సవ్వకండి.!
ఈ పోస్టులకు అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ సూచించింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పని చేసే అవకాశం ద్వారా భారత క్రికెట్ భవిష్యత్తును మలిచే కీలక పాత్ర పోషించే అవకాశముంటుందని బోర్డు పేర్కొంది. కోచింగ్ రంగంలో కొత్త సవాళ్లు ఎదుర్కొనాలనుకునే నిపుణులకు ఇది అరుదైన అవకాశం అని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తాజావార్తలు
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
-
OnePlus 16: 9000mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లేతో వన్‌ప్లస్ 16 5G ఫోన్.. 100W ఛార్జింగ్ కూడా!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
-
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!