Aamir Khan: అర్జిత్ ఇంటికి.. ఆమిర్ ఖాన్ వెళ్లడానికి అసలు కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్ ఇటీవల ప్లేబ్యాక్ సింగింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆమిర్ ఖాన్, పశ్చిమ బెంగాల్‌లోని అర్జిత్ సొంత ఇంటికి వెళ్లి నాలుగు రోజుల పాటు అక్కడే గడపడం సంచలనం సృష్టించింది. కేవలం రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పడానికే ఆమిర్ వెళ్లారని అందరూ భావించారు. అయితే, ఆ పర్యటన వెనుక అసలు కారణం తన కుమారుడు జునైద్ ఖాన్ నటిస్తున్న ‘ఏక్ దిన్’ (Ek Din) సినిమా అని ఆమిర్ స్పష్టం చేశారు.
Also Read : Pawan Kalyan: ‘ఫౌజీ’ భామకు డబుల్ జాక్‌పాట్.. ఏకంగా పవన్ కళ్యాణ్‌తో ఛాన్స్ !
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
“అర్జిత్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని ఒత్తిడి చేయడానికి నేను వెళ్లలేదు. కానీ నా సినిమా కోసం పాడమని కోరాను” అని ఆమిర్ ఖాన్ తెలిపారు. జునైద్ అంటే అర్జిత్‌కు ప్రత్యేకమైన ఇష్టం ఉండటంతో, ఆయన రిటైర్మెంట్ ప్రకటించడానికి ముందే ఈ సినిమాకు సంతకం చేశారని, ఇచ్చిన మాట ప్రకారం జునైద్ కోసం ఐదు పాటలు పాడటానికి అర్జిత్ అంగీకరించారని ఆమిర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నాలుగు రోజుల ప్రయాణం చాలా ‘మ్యాజికల్’గా సాగిందని, అర్జిత్ కుటుంబంతో కలిసి గడపడం ఒక మధుర జ్ఞాపకమని ఆయన పేర్కొన్నారు. జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా ‘ఏక్ దిన్’ ద్వారా అర్జిత్ సింగ్ గొంతు మరోసారి వెండితెరపై మారుమోగనుంది. ప్లేబ్యాక్ సింగింగ్‌కు స్వస్తి పలికి క్లాసికల్ మ్యూజిక్ వైపు వెళ్లాలనుకుంటున్న అర్జిత్, తాను అంగీకరించిన పాత ప్రాజెక్టులను మాత్రం పూర్తి చేస్తానని ఇప్పటికే స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!