Hydra: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
- ఆక్రమణలపై హైడ్రా భారీ ఆపరేషన్
- రూ.700 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
- కబ్జాదారులపై కేసులు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరం కొండాపూర్ ప్రాంతంలో ఉన్న జంగంకుంట ఆక్రమణలపై హైడ్రా (HYDRA) భారీ ఆపరేషన్ చేపట్టింది. సుమారు రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడుతూ.. అక్రమ కబ్జాదారులపై కఠిన చర్యలు చేపట్టింది. శేరిలింగం పల్లి మున్సిపల్ కార్యాలయం-మదీనగూడ మార్గంలో జంగమోనికుంటకు సంబంధించిన 4 ఎకరాల భూమిని కబ్జాదారులు ఆక్రమించారు. సర్వే నెంబర్ 134 పరిధిలో ఉన్న జంగమోనికుంటను పూర్తిగా మాయం చేస్తూ.. ఆక్రమణదారులు మట్టితో నింపి చదును చేసినట్లు అధికారులు గుర్తించారు.
Also Read: POVA Curve 2 5G: 8000mAh బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా సెటప్.. బడ్జెట్ తక్కువ, ఫీచర్స్ ఎక్కువ!
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
జంగమోనికుంట చెరువును నాశనం చేసి భూమిని ప్లాట్లుగా విభజించి అమ్మకానికి సిద్ధం చేసినట్లు హైడ్రా గుర్తించింది. ఈ అక్రమాలపై ఇప్పటికే రెవెన్యూ అధికారులు కబ్జాదారులపై కేసులు నమోదు చేశారు. హైడ్రా బృందం రెవెన్యూ అధికారులతో కలిసి జంగమోనికుంట వద్ద జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించి, భూమి స్థితిగతులను పూర్తిగా పరిశీలించింది. అక్రమ కబ్జాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీసుల సహకారంతో చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసే పనులను హైడ్రా సిబ్బంది ప్రారంభించింది. భవిష్యత్తులో మళ్లీ ఎలాంటి ఆక్రమణలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు, జల వనరులను రక్షించడమే లక్ష్యంగా హైడ్రాపై ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
తాజావార్తలు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!