ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం, అశ్రద్ధ పనికిరాదు. అసంబద్ద జీవనశైలి, ఆహార నియమాలతో మన ఆరోగ్యాన్ని తీసుకెళ్లి వైద్యుల చేతుల్లో పెట్టేలా పరిస్థితి తెచ్చుకోకూడదు.

మంచి అలవాట్లు ఆరోగ్యకరమైన జీవనానికి బాటలు వేస్తాయి. ఆరోగ్యం విషయంలో చేయకూడని తప్పుల గురించి తెలుసుకుందాం.

గంటల తరబడి శ్రమించిన తర్వాత శరీరానికి, మనసుకు విశ్రాంతి అవసరం. అందుకే మన శరీరానికి కావాల్సినంత నిద్రను ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది. 

తగినంత నిద్ర లేకపోతే అది రోగ నిరోధక వ్యవస్థ బలహీనతకు దారితీస్తుంది. అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటన్నింటికీ పరిష్కారం 8 గంటల పాటు మంచి నిద్ర పోవడమే.

మనలో చాలా మంది తమ శరీరానికి కావాల్సినంత నీరు అందించరు. మన శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపించేందుకు పుష్కలమైన నీటిని ఇవ్వాల్సిందే. 

తగినంత నీరు ఉన్నప్పుడు కిడ్నీలు చక్కగా పనిచేస్తూ, మలినాలను వడగడుతూ ఉంటాయి. తగినంత నీరు లేకపోతే కిడ్నీలు కూడా బద్దకిస్తాయి. శరీరంలో టాక్సిన్లు పెరుకుపోతాయి. 

మానసికంగా దృఢంగా ఉండడం కూడా మంచి ఆరోగ్యంలో భాగం. కరోనా సమయంలో ఇది ఏంటో అర్థమైంది. 

 నేటి పని ఒత్తిడులు, ఆధునిక జీనవశైలి కారణంగా మానసిక సమస్యలు పెరిగాయి. అందుకని ప్రాణాయామం, యోగాసనాలతో వీటిని అధిగమించాలి. 

ఎండలో ఎక్కువగా తిరగాల్సి వచ్చే వారు తప్పకుండా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. లేదంటే చర్మం దెబ్బతినడంతోపాటు, కేన్సర్ రిస్క్ ఏర్పడుతుంది.