Bhagwant Mann: పంజాబ్ సీఎంకు చుక్కెదురు.. భగవంత్ మాన్ విదేశీ టూర్‌కు కేంద్రం నిరాకరణ
- పంజాబ్ సీఎంకు చుక్కెదురు
- భగవంత్ మాన్ విదేశీ టూర్‌కు కేంద్రం నిరాకరణ
- కేంద్రంపై ఆమ్ ఆద్మీ పార్టీ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ ప్రభుత్వానికి-కేంద్రానికి మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో విదేశీ పర్యటనకు కేంద్రం అడ్డుకట్ట వేసింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నెదర్లాండ్స్, చెక్ రిపబ్లిక్ దేశాలకు వెళ్లేందుకు కేంద్ర అనుమతి కోరారు. కానీ అందుకు కేంద్రం నిరాకరించింది. ఇలా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం ఇది మూడోసారి. విదేశీ పర్యటనకు అనుమతి పొందడంలో మూడోసారి విఫలమయ్యారు. జనవరిలో యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), ఇజ్రాయెల్ పర్యటనకు అనుమతి నిరాకరించబడింది. తాజాగా ఇప్పుడు మరోసారి కేంద్రం అడ్డుకుంది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
- INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్, యూకే పర్యటనకు ముందు గతంలో పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌ను సందర్శించేందుకు భగవంత్ మాన్ అనుమతి కోరగా.. అప్పుడు కూడా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అనుమతి ఇవ్వలేదు. ఇలా వరుసగా మూడోసారి భగవంత్ మాన్‌కు నిరాకరించింది.
ఇది కూడా చదవండి: Rohit Paudel: హృదయాలను గెలిచిన నేపాల్.. ఓటమిపై కెప్టెన్ రియాక్షన్ ఇదే..
కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ధ్వజమెత్తింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆప్ ఆరోపించింది. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు కేంద్రం విధించిన ఆంక్షలు దెబ్బతీస్తున్నాయని మండిపడుతున్నారు. వచ్చే నెలలో జరగనున్న పెట్టుబడిదారుల సదస్సుకు పంజాబ్ ముఖ్యమంత్రి రెండు యూరోపియన్ దేశాల్లో ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాల్సి ఉందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Cryptocurrency Tragedy: హైదరాబాద్ పాతబస్తీలో విషాదం.. క్రిప్టో నష్టాలతో యువకుడి ఆత్మహత్య
ప్రొటోకాల్ ప్రకారం… ముఖ్యమంత్రులు ఏదైనా అధికారిక విదేశీ ప్రయాణానికి వెళ్లే ముందు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి రాజకీయ అనుమతి పొందాలి. అయితే భగవంత్ మాన్‌కు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ఎందుకు అనుమతి ఇవ్వలేదన్నది కారణం వెల్లడించలేదు. దీంతో రాజకీయ దుమారం రేగుతోంది.
తాజావార్తలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!