Comet: అంతరిక్షంలో మళ్లీ తిరిగి రాని అద్భుతం.. ఇప్పుడు కాకుంటే ఎప్పుడూ చూడలేరు..
- ఎప్పటికి తిరిగి రాని అద్భుతం..
- భూమి కక్ష్యకు దగ్గరగా తోకచుక్క..
- మళ్లీ ఎప్పటికీ తిరిగి రాని వియర్జోష్ కామెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Comet: ఇప్పుడు తప్పితే మళ్లీ ఎప్పుడూ చూడలేని ఖగోళ అద్భుతం కనువిందు చేయబోతోంది. మన జీవిత కాలంలో ‘‘తోక చుక్కల’’ను కనీసం ఒకసారి కూడా చూసే అవకాశం ఉండదు. అలాంటి ఒక తోకచుక్క, భూ కక్ష్యకు దగ్గర రాబోతోంది. C/2024 E1 (వియర్జోష్) అనే తోకచుక్క ఆకాశంలో దర్శనం ఇవ్వనుంది. ఇది సౌర కుటుంబం వెలుపలి నుంచి వచ్చినట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తోకచుక్కనున 2024 మార్చిలో పోలాండ్ ఖగోళ శాస్త్రవేత్త కాస్పర్ వియర్జోష్ కనుగొన్నారు. ఇది ఓర్ట్ క్లౌడ్ అనే చాలా దూర ప్రాంతం నుంచి వచ్చింది. ఈ ప్రాంతంలో కొన్ని లక్షల ఏళ్ల నుంచి మంచు పదార్థం కలిగిన ఖగోళ వస్తువులు ఉంటాయి.
మళ్లీ ఎందుకు చూడలేం..?
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ఈ తోకచుక్క ప్రయాణ మార్గం సాధారణంగా లేదు. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఇది సౌరకుటుంబం నుంచి శాశ్వతంగా బయటకు వెళ్లిపోతుంది. అందుకే దీనిని ఒకసారి మాత్రమే చూడగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
జనవరి 20, 2026న సూర్యుడికి అత్యంత దగ్గరగా వచ్చింది. జనవరి 1, 2026లో శుక్రగ్రహానికి దగ్గరగా వెళ్లింది. ఫిబ్రవరి 17, 2026 భూమి కక్ష్యకు సమీపంగా వస్తోంది.
తోకచుక్కలో ఏముంది.?
శాస్త్రవేత్తల ప్రకారం, ఈ తోకచుక్కలో ప్రధానం కార్బన్ డయాక్సైడ్ వాయువు ఉంది. సాధారణంగా కనిపించే తోకచుక్కల్లో కనిపించే కార్బన్ మోనాక్సైడ్ మాత్రం ఇందులో కనిపించలేదు. దీని న్యూక్లియస్ 2 నుంచి 10 కిలోమీటర్ల వెడల్పు ఉండొచ్చని అంచనా.
ఎలా కనిపిస్తుంది..?
సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు దీని చుట్టూ వాయువు, ధూళితో కూడి మేఘం ఏర్పడుతుంది. దీని తోక ఆకాశంలో కనిపిస్తుంది. దీని వెలుతురు 6.5-7 మ్యాగ్నట్యూడ్‌గా ఉండొచ్చు. బైనాక్యులర్స్ లేదా చిన్న టెలిస్కోపుల ద్వారా చూడవచ్చు. ఫిబ్రవరి 2026 ప్రారంభంలో కూడా ఈ తోకచుక్క కనిపించే అవకాశం ఉంది. భారతదేశ దక్షిణ ప్రాంతాల్లో సూర్యస్తమయం తర్వాత దక్షిణ-పడమర దిశలో తక్కువ ఎత్తులో కనిపించవచ్చు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!