Cyber Crime: రిటైర్డ్ ఇంజనీర్‌పై వలపు వల.. రూ.4 కోట్లు నొక్కేసిన కిలాడీ
- రిటైర్డ్ ఇంజనీర్‌పై వలపు వల
- రూ.4 కోట్లు నొక్కేసిన కిలాడీ
- మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా సైబర్ నేరాలు ఆగడం లేదు. ఎక్కడొక చోట మోసాలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా థానేలో సెక్స్‌టార్షన్ కేసు వెలుగు చూసింది. ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఇంజనీర్‌పై మహిళ వలపు వల విసిరింది. అందులో చిక్కుకున్న వృద్ధుడు రూ.4 కోట్లు వదిలించుకున్నాడు. దీంతో బాధితుడు లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించాడు.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో లైంగిక వేధింపుల కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ, ఆమె అనుచరులు రిటైర్డ్ ఇంజనీర్ (62)ను ఉచ్చులోకి లాగారు. ఒక మహిళ భావోద్వేగంతో రెచ్చగొట్టింది. దీంతో అతడు ఆమె వలలో చిక్కుకున్నాడు. అనంతరం నెమ్మది నెమ్మదిగా బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది.
Also Read
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్‌లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
ఇది కూడా చదవండి: PCB Decision: భారత్–పాక్ మ్యాచ్.. హై వోల్టేజ్ పోరుపై పీసీబీ సంచలన నిర్ణయం?
జూలై 17, 2025న బాధితుడికి తెలియని వాట్సాప్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తడంతో ఒక మహిళ మాట్లాడుతూ వ్యాపారం గురించి చర్చించింది. అంతర్జాతీయ వ్యాపారాలతో కోట్లు గడించవచ్చని నమ్మించింది. అటు తర్వాత నెమ్మది.. నెమ్మదిగా వలపు వల విసిరింది. ప్రేమ కురిపిస్తూ నటించింది. నిజమే అనుకుని వృద్ధుడు నమ్మేశాడు. అనంతరం అమెరికాలో తన మామ ద్వారా మంచి లాభదాయక వ్యాపారం ఉందని నమ్మ బలికింది. అటు తర్వాత ట్రేడింగ్ ఖాతా లింక్ పంపించింది. 7 నెలల్లో వివిధ ఖాతాల నుంచి లావాదేవీలు జరిగాయి. అయితే గత నెలలో విత్‌డ్రా చేసుకునేందుకు బాధితుడు ప్రయత్నించగా మోసం బయటపడింది. ఆ మహిళ నుంచి అసభ్యకరమైన సందేశాలు, ఫొటోలు రావడం ప్రారంభమయ్యాయి. నగ్న ఫొటోలను పంపించాలని ఒత్తిడి పెరిగింది.
ఈ క్రమంలో జనవరి 25న ఒక వ్యక్తి ఫోన్ చేసి మహిళ మామగా పరిచయం చేసుకున్నాడు. రూ.2 కోట్ల ఇవ్వకపోతే అత్యాచారం కేసు పెడతానని బెదిరించాడు. దీంతో చేసేదేమీలేక మొత్తానికి ఏడు నెలల్లో దాదాపు రూ.4 కోట్లు పోగొట్టుకున్నాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
ఇది కూడా చదవండి: PUBG: ప్రాణం తీసిన పబ్జీ .. మెదడులో రక్తస్రావం జరిగి యువకుడు మృతి
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
-
Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్‌లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!