Spirit: ‘స్పిరిట్’ సినిమా నుంచి తప్పుకున్న ప్రకాష్ రాజ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’. నిజానికి ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, డార్లింగ్ ఫ్యాన్స్‌లో రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ కనిపించనున్నారు. డార్లింగ్ కోసం సందీప్ రెడ్డి వంగా ఒక విభిన్నమైన, రా యాక్షన్ డ్రామాను సిద్ధం చేస్తున్నారని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. తన కెరీర్లో మొదటిసారిగా ప్రభాస్ ఈ సినిమాలో ఒక సీరియస్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతుంది. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే.. ఈ సినిమా నుంచి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తప్పుకున్నట్లు సమాచారం.
READ ALSO: SBI YONO App: ఎస్బీఐ యోనో యూజర్లు బీ అలర్ట్.. ఈ తప్పు చేస్తే ఖాతా ఖాళీ!
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
గతంలో ప్రభాస్ – ప్రకాష్ రాజ్ నడుమ సన్నివేశాలతో ఈ సినిమా షూట్ మొదలైనట్టు టాక్ కూడా వచ్చింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఈ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకున్నట్టు రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఇందులో ఎంత మేరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. వాస్తవానికి ఈ సినిమా నుంచి గతంలో రిలీజ్ అయిన వాయిస్ టీజర్‌లో ప్రకాష్ రాజ్ పాత్రకి ఈ మూవీలో ఎంతటి ఇంపార్టెన్స్ ఉందో అర్ధం అయ్యింది. తాజా ప్రచారంపై మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. ఇక సినిమా రిలీజ్ డేట్ విషయానికి వస్తే గతంలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల తేదీపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రం 2027, మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన విషయం సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన తృప్తి దిమ్రి కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో మెరవనున్నారు. ఇక ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
READ ALSO: Aamir Khan: ‘ధురంధర్’ కలెక్షన్స్‌పై ఆమిర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?