Airport Customs Rules: విదేశాల్లో నుంచి సుంకం లేకుండా ఎంత బంగారం తెచ్చుకోవచ్చు తెలుసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airport Customs Rules: విదేశాల నుంచి భారతదేశానికి ఎంత బంగారాన్ని తీసుకురావచ్చో మీకు తెలుసా?. నియమాల గురించి తెలియకపోతే ఒక రోజు మీరు కస్టమ్స్ గేట్ వద్ద పట్టుబడవచ్చు, ఆ టైంలో మీకు జరిమానా విధించబడుతుంది, సుదీర్ఘమైన చట్టపరమైన ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి వస్తుంది. ఇదంతా ఎందుకు ఆ నియమాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read
- B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
- LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
- No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
మీకు తెలిసినట్లుగా, ఇప్పటి వరకు రూ.50 వేల వరకు విలువైన వస్తువులను ఇతర దేశాల నుంచి భారతదేశానికి తీసుకురావడానికి అనుమతి ఉంది. అయితే ఇప్పుడు ఈ పరిమితిని పెంచారు. భారత ప్రభుత్వం బ్యాగేజీ నియమాలు 2026ను రిలీజ్ చేసింది. ఇది ఫిబ్రవరి 2, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. ఇప్పుడు భారతీయ ప్రయాణికులు ఎటువంటి కస్టమ్స్ సుంకం చెల్లించకుండా విదేశాల నుంచి రూ.75 వేల వరకు విలువైన వస్తువులను భారత్‌కు తీసుకురావచ్చు. గతంలో ఈ పరిమితి రూ.50 వేల వరకు మాత్రమే ఉండేది. తాజా నియయాల ద్వారా విదేశాల నుంచి బహుమతులు లేదా ఎలక్ట్రానిక్స్ తీసుకువచ్చే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుంది. విమానాశ్రయాలలో ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి, కస్టమ్స్ క్లియరెన్స్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ కొత్త నియమాలను ప్రవేశపెట్టినట్లు అధికారులు తెలిపారు.
బంగారం, వెండి తీసుకురావడానికి నియమాలు ఇవే..
బంగారం, వెండి తీసుకురావడంలో ఉన్న పరిమితుల గురించి ప్రయాణికులు తరచుగా గందరగోళానికి గురవుతారు. కొత్తగా నోటిఫై చేసిన నియమాల ప్రకారం.. ఇప్పుడు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం విదేశాలలో ఉన్న భారతీయ పురుష ప్రయాణికులు 20 గ్రాముల వరకు బంగారాన్ని సుంకం లేకుండా ఇండియాకు తీసుకురావడానికి అనుమతిస్తాయి. అయితే మహిళలకు ఈ మినహాయింపు రెట్టింపు అవుతుంది. మహిళా ప్రయాణికులు ఎటువంటి పన్ను లేకుండా 40 గ్రాముల వరకు బంగారం తీసుకురావచ్చు. పాత నిబంధనలు విమానాశ్రయ తనిఖీ కేంద్రాల సమయంలో గణనీయమైన సమయం వృథాకు కారణమవుతున్నాయని, ప్రయాణీకులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ కొత్త నియమాలు బంగారంపై స్పష్టమైన మార్గదర్శకాలు అమలు చేయడానికి, విమానాశ్రయాలలో పొడవైన క్యూలను తొలగించడానికి, ప్రయాణికుల ప్రయాణ సౌలభ్యాన్ని ప్రోత్సహిస్తాయని చెబుతున్నారు. పరిమితిని పెంచినప్పటికీ, ఈ మినహాయింపు కేవలం వ్యక్తిగత వస్తువులు, ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుందని అనేది గుర్తుంచుకోండి. మీరు ఈ పరిమితికి మించి బంగారం లేదా ఇతర వస్తువులను ఇండియాకు తీసుకువస్తే, మీరు దానిని రెడ్ ఛానల్ ద్వారా నివేదించాలి, దానికి వర్తించే కస్టమ్స్ సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
READ ALSO: Chiranjeevi – Mega 158: మార్చి నుంచే మెగా జాతర.. చిరు కూతురుగా రూ.1000 కోట్ల హీరోయిన్!
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!