T20 World Cup 2026: జియో హాట్‌స్టార్ వ్యూస్ సంచలనం.. వరల్డ్ క్రికెట్‌ను ఏలుతున్న భారత క్రికెట్ ఫాన్స్!
- భారత్, అమెరికా మ్యాచ్‌కు క్రేజీ వ్యూస్
- జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 270 మిలియన్ వ్యూస్
- వరల్డ్ క్రికెట్‌ను ఏలుతున్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs USA Match Views on Jio Hotstar: టీ20 వరల్డ్‌కప్ 2026 ప్రారంభ రోజే క్రికెట్‌కు ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి రుజువైంది. ముఖ్యంగా టీమిండియా మ్యాచ్‌కు వచ్చిన వ్యూస్ చూస్తే.. ప్రపంచ క్రికెట్‌లో భారత్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. జియో హాట్‌స్టార్‌లో ఓపెనింగ్ డే మ్యాచ్‌లకు వచ్చిన వ్యూస్ గణాంకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి.
ఓపెనింగ్ డేలో జరిగిన భారత్, అమెరికా మ్యాచ్‌కు జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 270 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇది మిగతా మ్యాచ్‌లతో పోలిస్తే.. చాలా ప్రత్యేకం అని చెప్పాలి. భారత జట్టు ఆడితే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎలా ట్యూన్ అవుతారో ఈ సంఖ్యే చెప్పేస్తోంది. భారత్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు.. అది ఒక ఎమోషన్, ఒక పండుగ అన్న భావనను ఈ వ్యూస్ మరోసారి నిరూపించాయి.
Also Read
- Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
- Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
- Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
- Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
ఇదే రోజు జరిగిన పాకిస్థాన్, నెదర్లాండ్స్ మ్యాచ్‌కు 40 మిలియన్ వ్యూస్ మాత్రమే నమోదు అయ్యాయి. అలాగే వెస్టిండీస్, స్కాట్లాండ్ మ్యాచ్‌కు 31 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ రెండు మ్యాచ్‌ల వ్యూస్‌ను కలిపినా.. భారత్ మ్యాచ్‌కు దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం. ఇదే ప్రపంచ క్రికెట్‌లో భారత్ మార్కెట్ పవర్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ఈ గణాంకాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి.. ప్రపంచ క్రికెట్‌ను నడిపిస్తున్నది భారత క్రికెట్ అభిమానులే.
Also Read: T20 World Cup 2026: చిన్న టీమ్‌ల పోరాటం, టాప్ జట్లకు జులక్.. అభిమానులకు నాన్‌స్టాప్ థ్రిల్!
టెలివిజన్ రేటింగ్స్ నుంచి డిజిటల్ వ్యూస్, స్పాన్సర్‌షిప్స్ నుంచి బ్రాడ్‌కాస్టింగ్ రెవెన్యూ వరకు.. అన్నింటిలోనూ భారత జట్టు కీలక పాత్ర పోషిస్తోంది. ఐసీసీ టోర్నీల్లో భారత్ మ్యాచ్‌లకు వచ్చే ఆదాయం.. మిగతా మ్యాచ్‌లతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం. టీ20 వరల్డ్‌కప్ ఓపెనింగ్ డే వ్యూస్ గణాంకాలు ఒకటే చెబుతున్నాయి.. భారత్ ఆడితేనే వరల్డ్ క్రికెట్ పరుగులు తీస్తుంది.
తాజావార్తలు
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!