US: ‘‘డల్లాస్ పాకిస్తాన్‌లా కనిపిస్తోంది’’.. ఇస్లామీకరణపై యూఎస్ నేత ఆందోళన..
- అమెరికాలో పెరుగుతున్న ముస్లిం వలసలపై రిపబ్లికన్ నేత ఆందోళన..
- డల్లాస్, పాకిస్తాన్‌లా మారిందని వ్యాఖ్యలు..
- గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US: అమెరికాలో పెరుగుతున్న ముస్లిం వలసలపై రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాండన్ గిల్ ఆందోళన వ్యక్తం చేశారు. యూఎస్‌లోని కొన్ని ప్రాంతాలు వేగంగా ‘‘ఇస్లామీకరణ’’కు గురవుతున్నాయని అన్నారు. టెక్సాస్‌లోని కొన్ని మాల్స్ వెళ్తే, మనం డల్లాస్‌లో ఉన్నామా..? లేక పాకిస్తాన్‌లో ఉన్నామా..? అని అనిపిస్తోందని చెప్పడం ఇప్పుడు వివాదాస్పదమైంది. సామూహిక ఇస్లామిక్ వలసలు మనం ఎంతగానో ప్రేమించే అమెరికాను చంపుతున్నాయని అన్నారు. ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో సందేశంలో, డల్లాస్‌లోని కొన్ని ప్రాంతాల్లో జనాభా మార్పులు గణనీయంగా చోటు చేసుకున్నాయని ఆరోపించారు.
Read Also: Tata EV Cars Discount: టాటా ఈవీ కార్లు కొనేవారికి గుడ్న్యూస్.. ఏకంగా రూ. 3.8 లక్షల వరకు తగ్గింపు
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
డల్లాస్ వ్యాప్తంగా మసీదులు పెరుగుతున్నాయని, ఎపిక్ సిటీ కంపౌడ్స్ వంటి పెద్ద ఇస్లామిక్ కమ్యూనిటీలు ఏర్పడుతున్నాయని, ఇవి మన అమెరికన్ సంస్కృతిని మార్చేస్తో్ందని ఆయన అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై అక్కడి ముస్లిం సంఘాలు, పాక్ సంతతి డాక్టర్లు, సామాజిక కార్యకర్తలు గిల్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయని, ముస్లింలపై తప్పుడు అపోహలు పెంచుతున్నాయని చెబుతున్నారు.
గతంలో కూడా బ్రాండమ్ గిల్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇస్లాం అమెరికాను నావనం చేయడానకి వచ్చిందని అన్నారు. న్యూయార్క్ నగర మేయర్, భారత మూలాలు ఉన్న జోహ్రాన్ మమ్దానీ తన చేతులతో అన్నం తింటున్న వీడియోపై.. ఇలాంటి వ్యక్తులు అమెరికాకు సరిపోరని, మూడో ప్రపంచ దేశాలకు తిరిగి వెళ్లు అంటూ వ్యాఖ్యలు చేశారు. సామూహిక వలసలు అమెరికాను నాశనం చేస్తాయని, భారత్ లాంటి దేశాల నుంచి వలసలు హాని కలిగిస్తాయని అన్నారు. గుజరాతీ వాలీబాల్ ఈవెంట్ పై స్పందిస్తూ.. మనకు కుల వ్యవస్థ లేదు కాబట్టి అమెరికా అవకాశాలకు కేంద్రంగా ఉందని అన్నారు.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!