Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 5pm 08 02 2026

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Published Date :February 8, 2026 , 5:12 pm
By Gogikar Sai Krishna
  • ఓటుకు నోటు కేసు రిపోర్టులు సేఫ్..
  • ‘‘బంగ్లాదేశ్ హిందువులు పోరాడితే..’’ ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
  • అంబటి రాంబాబుకి బిగ్ షాక్.. పీటీ వారెంట్ దాఖలు చేసిన పోలీసులు
  • ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో 169 సార్లు దలైలామా పేరు..
Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఓటుకు నోటు కేసు రిపోర్టులు సేఫ్..

నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ షికా గోయల్ స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో రిపోర్టులు సేఫ్‌గా ఉన్నాయని స్పష్టం చేశారు. ఉదయం 10.08 నిమిషాలకు ఎఫ్ఎస్ఎల్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగి సాయికృష్ణ సీఐ శ్రీనివాస్ రెడ్డికి సమాచారం అందించారని చెప్పారు. ఘటన స్థలానికి 10.30 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారని.. 1.30 నిమిషాలకు మంటలు అదుపులోకి వచ్చాయన్నారు. 2015 సంవత్సరంలో ఏసీబీకి సంబంధించిన కేసు 16 మెటీరియల్స్ ధ్వంసం అయ్యాయని తెలిపారు. కేసుకు సంభంచిన మెటీరియల్స్ 2021 లో ఏసీబీ కోర్టుకు పొందపరిచామని స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో రిపోర్టులను ఆల్రెడీ ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చిందని వెల్లడించారు..

Also Read

  • Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
  • Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
  • Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం మెగా ప్లాన్..
  • Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో 169 సార్లు దలైలామా పేరు..

టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు, ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా పేరు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు మీడియా సంస్థలు దీనిని నివేదించాయి. అయితే, ఈ మీడియా నివేదికల్ని దలైలామా ఆఫీస్ తీవ్రంగా ఖండించింది. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ మైనర్ బాలికల సె*క్స్ కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లను అమెరికన్ న్యాయశాఖ విడుదల చేసింది. ఈ ఫైళ్లలో దలైలామా పేరు 169 సార్లు కనిపించిందని పలు మీడియా సంస్థలు నివేదించాయి. మల్టిపుల్ ఈమెయిళ్లలో, మసాజ్ ఫర్ డమ్మీస్ పుస్తకంలో ఆయన పేరు ఉందనే ఆరోపణలు వచ్చాయి.

‘‘డల్లాస్‌ పాకిస్తాన్‌లా కనిపిస్తోంది’’.. ఇస్లామీకరణపై యూఎస్ నేత ఆందోళన..

అమెరికాలో పెరుగుతున్న ముస్లిం వలసలపై రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాండన్ గిల్ ఆందోళన వ్యక్తం చేశారు. యూఎస్‌లోని కొన్ని ప్రాంతాలు వేగంగా ‘‘ఇస్లామీకరణ’’కు గురవుతున్నాయని అన్నారు. టెక్సాస్‌లోని కొన్ని మాల్స్ వెళ్తే, మనం డల్లాస్‌లో ఉన్నామా..? లేక పాకిస్తాన్‌లో ఉన్నామా..? అని అనిపిస్తోందని చెప్పడం ఇప్పుడు వివాదాస్పదమైంది. సామూహిక ఇస్లామిక్ వలసలు మనం ఎంతగానో ప్రేమించే అమెరికాను చంపుతున్నాయని అన్నారు. ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో సందేశంలో, డల్లాస్‌లోని కొన్ని ప్రాంతాల్లో జనాభా మార్పులు గణనీయంగా చోటు చేసుకున్నాయని ఆరోపించారు.

అంబటి రాంబాబుకి బిగ్ షాక్.. పీటీ వారెంట్ దాఖలు చేసిన పోలీసులు

మాజీ మంత్రి, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత అంబటి రాంబాబుపై పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ గతంలో చేపట్టిన ఆందోళన సందర్భంగా బారికేడ్లను తోసుకుంటూ వెళ్లిన ఘటనకు సంబంధించి అప్పట్లోనే అంబటిపై కేసు నమోదు అయింది. ఈ కేసును పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన పోలీసులు తాజాగా పీటీ వారెంట్‌ను కోర్టులో దాఖలు చేశారు. ఈ నెల 11వ తేదీలోపు అంబటి రాంబాబును కోర్టులో హాజరుపర్చాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రాంబాబును రేపు కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. మరోవైపు అంబటి రాంబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌తో పాటు కస్టడీ పిటిషన్‌లపై రేపు మొబైల్ కోర్టు తీర్పు వెల్లడించనుంది.

వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్న ప్రియురాలు.. బాడీబిల్డర్ ఏం చేశాడంటే?

అందరి ప్రేమలు పెళ్లి పీటలెక్కడం లేదు. దీనికి కారణం తల్లిదండ్రులు అంగీకరించకపోవడం, కులమతాల అడ్డుగోడలు, పరువు ప్రతిష్టలు ఇలా చాలా ఉన్నాయి. దీంతో ప్రేమికులు ఒకరిని విడిచి ఉండలేక, కలిసి జీవించలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక తనువులు చాలిస్తున్నారు. ఇదే రీతిలో బెంగుళూరులో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ బాడీబిల్డర్ తన ప్రియురాలు వేరే వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో కలత చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరులో 26 ఏళ్ల బాడీబిల్డర్ తన ప్రేయసి వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్నట్లు చెప్పడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

రోహిత్-కోహ్లీ లేని లోటును తీర్చేస్తూ.. అరుదైన మైలురాయిని సృష్టించిన భారత్!

T20 ప్రపంచ కప్‌లో టీమిండియా తన ఫస్ట్ మ్యాచ్‌ను USAతో ఆడి విజయం సాధించిన విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 29 పరుగుల తేడాతో USAపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవడమే కాకుండా చారిత్రాత్మక ప్రపంచ రికార్డును కూడా సృష్టించింది. T20 ప్రపంచ కప్ చరిత్రలో ఏ ఇతర జట్టు సాధించని ఘనతను భారత జట్టు లిఖించింది. ఇంతకీ ఆ ఘనత ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

‘‘బంగ్లాదేశ్ హిందువులు పోరాడితే..’’ ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధిపతి మోహన్ భాగవత్ ఆదివారం బంగ్లాదేశ్ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాలోని హిందువులకు గట్టి సందేశం ఇచ్చారు. దేశంలో హిందూ జనాభా తమ హక్కుల కోసం పోరాడితే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మద్దతు లభిస్తుందని చెప్పారు. వర్లీలోని నెహ్రూ సెంటర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ‘‘100 ఇయర్స్ జర్నీ ఆఫ్ సంఘ్: న్యూ హారిజొన్’’ అనే కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రసంగించారు. 2024 ఆగస్టులో హింసాత్మక నిరసనల కారణంగా అప్పటి ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి అక్కడ హిందువులపై దాడులు మొదలయ్యాయి. ఇటీవల, విద్యార్థి నేత ఉస్మాన్ హాది మరణం తర్వాత హిందువుల్ని టార్గెట్ చేస్తూ పలు హత్యలు జరిగాయి.

నంగునూరు మండలం ఘనపూర్ శివారులో పశువులపై పెద్దపులి దాడి

సిద్ధిపేట జిల్లాను ఇప్పుడు పెద్దపులి భయం వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా జిల్లాలోని వివిధ గ్రామాల్లో పశువులపై పులి దాడి చేస్తుండటంతో అటవీ ప్రాంత ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. వరుసగా రెండో రోజు కూడా లేగదూడలను పులి చంపి తినడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిన్న రాత్రి లేగదూడలపై దాడి చేసి చంపిన పులి, వాటిని భక్షించింది. కేవలం ఘనపూర్ మాత్రమే కాదు.. అంతకుముందు ధూల్మిట్ట మండలం కూటిగల్, భైరాన్‌పల్లితో పాటు మద్దూరు మండలం లద్నూర్, అమ్మాపూర్ గ్రామాల్లో కూడా పులి పశువులను చంపి తిన్నట్లు అధికారులు గుర్తించారు.

తొలిసారి ఓరుగల్లు గడ్డపై రాకెట్ ప్రయోగం.! ఆకాశంలోకి దూసుకెళ్లనున్న ‘రుద్రమ’ రాకెట్..

వరంగల్ చారిత్రక నగర కీర్తి కిరీటంలో మరో మణిహారం చేరబోతోంది. విద్యా, సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందుతున్న ఓరుగల్లు గడ్డపై మొట్టమొదటిసారిగా ఒక మోడల్ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 28న నిర్వహించ తలపెట్టిన ఈ అద్భుత ఘట్టం, అటు విద్యార్థుల్లో ఇటు సామాన్య ప్రజల్లో అంతరిక్ష విజ్ఞానంపై సరికొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇస్రో స్పేస్ ట్యూటర్ , ఏటీడీఆర్ఎల్ వ్యవస్థాపకుడు శశాంక్ భూపతి నేతృత్వంలో రూపొందిన ఈ ప్రాజెక్టుకు వరంగల్ నిట్ , కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm chandrababu
  • CM Revanth Reddy
  • telugu news
  • Top Headlines 5PM
  • Top News

తాజావార్తలు

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?

  • Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?

  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..

  • Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions