PUBG: ప్రాణం తీసిన పబ్జీ .. మెదడులో రక్తస్రావం జరిగి యువకుడు మృతి
- ప్రాణం తీసిన పబ్జీ
- మెదడులో రక్తస్రావం జరిగి యువకుడు మృతి
- మీరట్‌లో 22 ఏళ్ల మహ్మద్ కైఫ్ పబ్జీ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆన్‌లైన్ మొబైల్ గేమ్‌లు ప్రమాదకరమే కాదు ప్రాణాంతకంగా మారాయి. ఆన్‌లైన్ కొరియన్ డ్రామా గేమ్‌లో మునిగిపోయిన ముగ్గురు సోదరీమణులు ఘజియాబాద్‌లోని భారత్ సొసైటీ తొమ్మిదవ అంతస్తు నుండి దూకిన ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా మీరట్‌లో 22 ఏళ్ల మహ్మద్ కైఫ్ పబ్జీ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఖైర్‌నగర్‌లోని గులార్ వాలి గలిలో నివసిస్తున్న ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు కైఫ్, ఆన్‌లైన్ గేమ్ PUBG ఆడుతున్నప్పుడు మెదడు రక్తస్రావంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో, అతన్ని ఢిల్లీకి తరలించారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో రెండు రోజుల చికిత్స తర్వాత కైఫ్ ఆదివారం మరణించాడు. ఒక్కాగొనక్క కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Also Read:PNB Recruitment 2026: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 5,138 పోస్టులు.. జస్ట్ డిగ్రీ ఉంటే చాలు..
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఢిల్లీ గేట్‌లోని ఖైర్‌నగర్ గులార్ వాలి నివాసి అయిన మహ్మద్ ఫరూఖ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తు్న్నాడు. కైఫ్ తన తండ్రికి సాయపడుతుంటాడు. శుక్రవారం నాడు, కైఫ్ ఆఫీస్ లో కూర్చుని తన మొబైల్ ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్ PUBG ఆడుతున్నాడని ఫరూఖ్ చెప్పాడు. అతను ఇయర్‌ఫోన్ ధరించి ఉన్నాడు. అకస్మాత్తుగా, కైఫ్ స్పృహ తప్పి పడిపోయాడు. ఆఫీసులో ఉన్నవారు అతన్ని సమీపంలోని వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అతని రక్తపోటును తనిఖీ చేశారు. అది 300 కంటే ఎక్కువగా ఉంది. కైఫ్‌ను వెంటనే హోప్ నర్సింగ్ హోమ్‌లో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా ఉండటం చూసి వైద్యులు వెంటనే అతన్ని రిఫర్ చేశారు.
Also Read:Tragedy: కూకట్‌పల్లిలో విషాదం.. ట్రాన్స్‌ఫార్మర్‌పై పడిన పతంగి తీస్తూ బాలుడు విద్యుత్ షాక్
అతని కుటుంబ సభ్యులు అతన్ని ఢిల్లీకి తరలించి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. అధిక రక్తపోటు కారణంగా అతని మెదడులోని రక్తనాళం చీలిపోయి అంతర్గత రక్తస్రావం జరిగిందని వైద్యులు నిర్ధారించారు. కైఫ్‌ను కాపాడే ప్రయత్నాలు రెండు రోజులు కొనసాగాయి. ఆదివారం చికిత్స పొందుతూ కైఫ్ మరణించాడు. కైఫ్ మొబైల్ ఫోన్ తో ఎక్కువ గడిపేవాడని ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ తరచుగా వీడియో రీల్స్ కూడా చేసేవాడని తెలిపారు. వద్దని వారించినా వినేవాడు కాదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!