CM Revanth Reddy : కొత్త జిల్లాలు.. ఉన్న జిల్లాల తొలగింపుపై సీఎం రేవంత్ క్లారిటీ
- జిల్లాల రద్దు ప్రచారానికి సీఎం ఫుల్ స్టాప్
- కొత్త జిల్లాల ఏర్పాటు లేదని స్పష్టీకరణ
- భూపాలపల్లి జిల్లా యథాతథంగా కొనసాగుతుందని హామీ
- భవిష్యత్తులో మార్పులుంటే ప్రజలకు ముందస్తు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా , రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరదించారు. ప్రస్తుతం ఉన్న జిల్లాలను రద్దు చేస్తారని లేదా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టించేలా విష ప్రచారాన్ని చేస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు.
PNB Recruitment 2026: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 5,138 పోస్టులు.. జస్ట్ డిగ్రీ ఉంటే చాలు..
Also Read
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై మాట్లాడుతూ, ఏ జిల్లాను తొలగించే ఆలోచన గానీ, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ప్రతిపాదన గానీ ప్రస్తుతానికి ప్రభుత్వ పరిధిలో లేదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన ప్రత్యేకంగా స్పందించారు. భూపాలపల్లి జిల్లా ఎక్కడికీ పోదని, అది యథావిధిగా కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ వేదిక ద్వారా తాను స్పష్టమైన భరోసా ఇస్తున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఒకవేళ భవిష్యత్తులో పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి లేదా రేషనలైజ్ చేయాలి అని ప్రభుత్వం భావిస్తే, జిల్లాల మార్పులపై ఏదైనా ఆలోచన ఉంటే ముందుగా బహిరంగంగా ప్రజలకు తెలియజేస్తామన్నారు. శాసనసభలో (అసెంబ్లీ) దీనిపై సమగ్రంగా చర్చ నిర్వహిస్తామని, ప్రతిపక్ష పార్టీల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం ఉంటుంది.
Kakani Govardhan Reddy: కూటమి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తాం..
తాజావార్తలు
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?