PM MODI: ‘‘ మలేషియా ప్రధాని ఎంజీఆర్‌కు పెద్ద అభిమాని’’.. మోడీ పర్యటనలో తమిళ సాంగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM MODI: ప్రధాని నరేంద్రమోడీ మలేషియాలో పర్యటిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి అనేక ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని మోడీ గౌరవార్థం మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆయన విందులో, 1975 నాటి బ్లాక్ బస్టర్ తమిళ సినిమా ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్) నటించిన ‘‘నాలై నమదే’’లోని ఒక సాంగ్ ప్లే చేశారు. దీంతో, ప్రధాని మోడీ, అన్వర్ ఇబ్రహీం ఎంజీఆర్ అభిమాని అని గుర్తించారు. దీనిని సోషల్ మీడియాలో పీఎం మోడీ పోస్ట్ చేశారు.
Also Read
‘‘నా స్నేహితుడు, ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఏర్పాటు చేసిన విందులో ఒక పాట, లెజండరీ ఎంజీఆర్ నటించిన సినిమా నాలైనమదే లోనిది. భారత్‌లో చాలా మందిలాగే, ప్రధాని అన్వర్ ఇబ్రహీం కూడా ఎంజీఆర్‌కు పెద్ద అభిమాని’’ అని ట్వీట్ చేశారు. సినిమాలు, సంగీతం, ముఖ్యంగా తమిళ సినిమాల ద్వారా రెండు దేశాలు మరింత దగ్గరవుతాయని తాను విశ్వసిస్తున్నట్లు మోడీ చెప్పారు.
ఎంజీఆర్ తమిళ చలనచిత్ర చరిత్రలో, రాజకీయ రంగంలో ఒక ఐకాన్‌గా నిలిచారు. అన్నాడీఎంకేను స్థాపించి ముఖ్యమంత్రి అయ్యాయి. 1987లో ఆయన మరణించినప్పటికీ, తమిళనాడుతో సహా దేశంలో చాలా ప్రాంతాల్లో ఆయన అభిమానులు ఉన్నారు. మలేసియా-భారత్ మధ్య చోళుల కాలం నుంచే సంబంధాలు ఉన్నాయి. మలేషియాలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద భారత సంతతి ప్రజలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది తమిళులే. అక్కడి పాఠశాలలు, మీడియా, సాంస్కృతిక రంగాలల్లో తమిళ భాషకు స్పష్టమైన స్థానం ఉంది.
எனது நண்பர் பிரதமர் அன்வர் இப்ராஹிம் அளித்த மதிய விருந்தில், பாடப்பட்ட பாடல்களில் ஒன்றாக மகத்தான மனிதர் எம்.ஜி.ஆர் நடித்த திரைப்படத்தில் இடம்பெற்ற 'நாளை நமதே' என்ற பாடலும் இருந்தது!
இந்தியாவில் உள்ள நம்மில் பலரைப் போலவே, பிரதமர் அன்வர் இப்ராஹிமும் எம்.ஜி.ஆரின் தீவிர ரசிகர்… pic.twitter.com/SEjT7Zaalw
— Narendra Modi (@narendramodi) February 8, 2026
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!