Tiger Tension: నంగునూరు మండలం ఘనపూర్ శివారులో పశువులపై పెద్దపులి దాడి
- పులి సంచారంతో గ్రామాల్లో భయాందోళనలు
- లేగదూడలపై వరుసగా రెండో రోజు దాడి
- డ్రోన్లు, సీసీ కెమెరాలతో గాలింపు
- బోన్లు ఏర్పాటు చేసి పట్టుకునే ప్రయత్నాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger Tension in Siddipet: సిద్ధిపేట జిల్లాను ఇప్పుడు పెద్దపులి భయం వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా జిల్లాలోని వివిధ గ్రామాల్లో పశువులపై పులి దాడి చేస్తుండటంతో అటవీ ప్రాంత ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. వరుసగా రెండో రోజు కూడా లేగదూడలను పులి చంపి తినడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిన్న రాత్రి లేగదూడలపై దాడి చేసి చంపిన పులి, వాటిని భక్షించింది. కేవలం ఘనపూర్ మాత్రమే కాదు.. అంతకుముందు ధూల్మిట్ట మండలం కూటిగల్, భైరాన్‌పల్లితో పాటు మద్దూరు మండలం లద్నూర్, అమ్మాపూర్ గ్రామాల్లో కూడా పులి పశువులను చంపి తిన్నట్లు అధికారులు గుర్తించారు.
Mohan Bhagwat: ‘‘బంగ్లాదేశ్ హిందువులు పోరాడితే..’’ ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
వరుస దాడులతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పులి పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు.. అది పెద్దపులి అని ధృవీకరించారు. పులి జాడ కోసం అధికారులు డ్రోన్ కెమెరాలు, సిసి కెమెరాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. పొలాలకు వెళ్లే రైతులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావద్దని గ్రామాల్లో దండోరా వేయించారు. పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేసేందుకు కూడా అటవీ శాఖ కసరత్తు చేస్తోంది. అప్పటివరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
Vellampalli Srinivas: లడ్డూలో ఫ్యాట్ ఉందని నిరూపిస్తారా.. కూటమి నేతలకు వెల్లంపల్లి ఛాలెంజ్..
తాజావార్తలు
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
-
RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!