రోజుకు రెండు సార్లు మాత్రమే ముఖం కడగాలి. వేడి నీటితో శుభ్రం చేస్తే.. చర్మం లోని గ్రంధుల్ని వేడి నీరు ప్రభావితం అయ్యేలా చేసి, జిడ్డు రాకుండా చేస్తుంది.

ఒక కాటన్ బాల్‌ని నిమ్మరసంలో ముంచి.. దాన్ని ముఖంపై, మెడపై సున్నితంగా పూయాలి. ఇలా చేస్తే.. జిడ్డు చర్మం ఆరోగ్యంగా, అందంగా తయారవుతుంది.

ఆయిల్ శాతం ఎక్కువగా ఉండే షాంపూలను వాడకపోవడం ఉత్తమం. ముఖంపై జుట్టు ఎక్కువగా పడకుండా చూసుకుంటే, అధికంగా వచ్చే జిడ్డుని నివారించవచ్చు.

పెసరపిండిలో కొంచెం పెరుగు, నీళ్లు కలిపి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. అది ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగితే.. జిడ్డు చర్మం తాజాగా మారుతుంది.

రోజ్ వాటర్ చర్మానికి రాయటం మంచిది. ఇలా రాస్తే.. అది స్కిన్ టోనర్‌గా పని చేసి, గ్రంధుల్ని మూసుకుపోయేలా చేసి, చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. 

సహజసిధ్ధమైన తేయాకు నూనె చర్మానికి రాస్తే ఎంతో ఉత్తమం. ఈ నూనె జిడ్డుని తొలగించడమే కాక.. మచ్చలపై, మొటిమలపై కూడా పని చేస్తుంది.

బేకింగ్‌ సోడాలో కొద్దిగా నిమ్మరసం కలిపి.. మొటిమలూ, యాక్నె సమస్య ఉన్న చోట పూతలా రాయండి. కాసేపయ్యాక తడి చేత్తో మర్దన చేసి, ఆ పూతను తీసెయ్యాలి.

జిడ్డు చర్మ సమస్యతో బాధపడుతున్న వారు డైయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. నిత్యం మాంసాహారం భుజించినా.. జిడ్డు సమస్య తెలెత్తుతుంది.

మేకప్ వేసుకునే అలవాటు వున్న చాలా జాగ్రత్తగా వుండాలి. జిడ్డు చర్యం కలిగిన వారు తేలికపాటి మేకప్ మాత్రమే వేసుకోవాలి. 

ముఖం కడిగిన తర్వాత మొక్కజొన్న పిండిలో నీళ్లు కలిపి, ముఖానికి పూతలా రాయాలి. కాసేపయ్యాక కడిగేస్తే.. ముఖంపై ఉండే జిడ్డు తొలగిపోతుంది.