Siraj vs Surya Kumar: బ్యాగులు సర్దుకోమని చెప్పిన సూర్య.. షాక్ అయిన సిరాజ్
- వరల్డ్‌కప్‌లో సిరాజ్ సడెన్ ఎంట్రీ..
- బ్యాగులు సర్దుకోమని చెప్పిన సూర్య..
- చివరి నిమిషంలో ఛాన్స్.. 3 వికెట్లు తీసిన సిరాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siraj vs Surya Kumar: భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు వచ్చిన వరల్డ్‌కప్ పిలుపు మొదట్లో సరదాగా అనిపించిందట. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం హర్షిత్ రాణా గాయంతో టోర్నమెంట్‌కు దూరం కావడంతో, అతని స్థానంలో సిరాజ్‌ను భారత జట్టులోకి ఎంపిక చేశారు. అయితే, భారత పేసర్ మహ్మద్ సిరాజ్ తనకు వచ్చిన వరల్డ్‌కప్ పిలుపు మొదట్లో జోక్ అనిపించిందని పేర్కొన్నాడు. టోర్నీకి ప్రారంభానికి కేవలం రెండు రోజుల ముందు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ నుంచి కాల్ రావడంతో ఆశ్చర్యానికి గురయ్యా… సూర్య భాయ్ ఫోన్ చేసి ‘మియా.. బ్యాగులు సర్దుకో, వెంటనే రా’ అని చెప్పారు.. దీంతో నన్ను ఆట పట్టిస్తున్నారని అనుకున్నాను.. ‘ఇలాంటి విషయాల్లో జోక్ చేయొద్దని’ అన్నాను.. కానీ ఆయన ‘ఇది జోక్ కాదు, నిజంగా రా’ అని సీరియస్‌గా చెప్పారని సిరాజ్ వెల్లడించారు.
Read Also: T20 World Cup: “మేము పాకిస్థాన్ చేతిలో ఓడిపోలేదు”.. నెదర్లాండ్స్ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
ఆ తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ నుంచి కూడా ఫోన్ రావడంతో సూర్య కుమార్ చెప్పింది నిజమేనని అర్థమైందని సిరాజ్ తెలిపాడు. అప్పుడే తన వరల్డ్‌కప్ ప్రయాణం మొదలైందని చెప్పాడు. వరల్డ్‌కప్ ఆడటం ప్రతి క్రికెటర్ కల.. దేవుడు రాసినదే జరుగుతుంది.. కానీ మనం కష్టపడటం మాత్రం ఆపకూడదు.. నిజాయితీగా శ్రమిస్తే ఫలితం ఎక్కడో ఒక చోట తప్పకుండా దొరుకుతుందని మహ్మద్ సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు.
Read Also: Funky : బూతులు తిట్టేసే విశ్వక్ సేన్ కాదు.. ఇప్పుడు తను మారాడు : నాగవంశీ
ఇక, టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు రోజు జస్ప్రీత్ బుమ్రా అనారోగ్యంతో జట్టుకు దూరమయ్యాడు.. దీంతో ఆలస్యంగా జట్టులో చేరిన సిరాజ్‌కు తుది జట్టులో ఛాన్స్ దక్కింది. జూలై 2024 తర్వాత తన తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన సిరాజ్, అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో తన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తెచ్చాడు. నాలుగు ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 3 వికెట్లు తీసుకున్నాడు.
Read Also: Suryakumar Yadav: కోహ్లీ రికార్డుకు చెక్.. సూర్య భాయ్ నయా హిస్టరీ..
అయితే, ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో భారత్ మొదట బాగానే మొదలెట్టింది. కానీ మధ్య ఓవర్లలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అమెరికా బౌలర్ షాడ్లీ వాన్ షాల్క్విక్ భారత బ్యాటింగ్‌ను గట్టిగా దెబ్బతీశాడు. అభిషేక్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే తొందరగా అవుట్ కావడంతో తీవ్ర ఇబ్బందుల్లో పడిన జట్టును కెప్టెన్ సూర్య ఆదుకోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. బ్యాటింగ్ కి వచ్చిన యూఎస్ఏ టీమిండియా బౌలర్ల ధాటికి క్రీజులో నిలవలేక 132 పరుగులకే కుప్పకూలిపోయింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!