Operation Sindoor: భారత్ దెబ్బకు ఇంకా రిపేర్లు చేయించుకుంటున్న పాకిస్తాన్..
- భారత్ దెబ్బకు రిపేర్లు చేయించుకుంటున్న పాకిస్తాన్..
- ఆపరేషన్ సిందూర్‌లో పాక్ ఎయిర్ బేసులపై దాడులు..
- ఇప్పటికీ మరమ్మతుల పనులు చేయించుకుంటున్న వైనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: భారత్ పాకిస్తాన్ మధ్య గతేడాది మే నెలలో జరిగిన యుద్ధం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. కేవలం 88 గంటల్లోనే పాకిస్తాన్‌ను భారత్ కాళ్ల బేరానికి తెచ్చింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రారంభించింది. పాక్, పీఓకేలోని లష్కరేతోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి, వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. పాకిస్తాన్ సైన్యం కవ్వింపులకు పాల్పడితే, భారత వాయు సేన ఏకంగా పాక్ వైమానిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఏకంగా 10కి పైగా పాక్ ఎయిర్ బేసులు ధ్వంసమయ్యాయి.
Read Also: Former ICC Chairman Ehsan Mani: “మాట్లాడండి.. బయపెట్టకండి”.. అలా ఐతే భారత్-పాక్ మ్యాచ్ కష్టమే!
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
ఇదిలా ఉంటే, భారత్ చేసిన దాడుల తర్వాత ఇప్పటికీ పాకిస్తాన్ రిపేర్లు చేయించుకుంటుంది. పాక్ భోలారి ఎయిర్‌బేస్ పునర్నిర్మాణం ప్రారంభమైందని శాటిలైట్ ఇమేజ్‌లు చూపిస్తున్నాయి. 2025 మే 10న ఉదయం 10-12 గంటల మధ్యలో భారత్ ఎయిర్ ఫోర్స్ భోలారి ఎయిర్ బేస్‌పై మిస్సైల్ అటాక్ చేసింది. పాకిస్తాన్‌కు ఎంతో కీలకమైన SAAB 2000 ‘Erieye’ ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ విమానం ఈ దాడిలో ధ్వంసమైనట్లు తెలుస్తోంది. భోలారి హ్యాంగర్ పూర్తిగా దెబ్బతింది. మురీడ్, సుక్కూర్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లు కూడా భారత దాడిలో తీవ్రంగా ధ్వంసమయ్యాయి. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పాక్ సైనిక ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండిలో ఉండటం గమనార్హం.
మే 9 రాత్రి మొదలైన దాడుల్లో భారత వాయుసేన కనీసం 10 ప్రధాన పాక్ ఎయిర్ బేసుల్ని లక్ష్యంగా చేసుకుంది. రాఫెల్ యుద్ధవిమానాల నుంచి స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడింది. సుఖోయ్ 30 MKI నుంచి ఇజ్రాయెల్ రాంపేజ్ క్షిపణులను ఉపయోగించింది. మిరేజ్-2000 నుంచి క్రిస్టల్ మేజ్ క్షిపణులు, సుఖోయ్ ద్వారా బ్రహ్మోస్ ఎయిర్ టూ సర్పెస్ క్షిపణులను ప్రయోగించి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. నూర్ ఖాన్, చక్లాలా, రఫికీ, రహీం యార్ ఖాన్, సుక్కూర్, మురీడ్, నయాచోర్ ఇలా పలు ఎయిర్ బేసులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..