Rafale Deal: 114 రాఫెల్ జెట్‌ల కోసం భారత్-ఫ్రాన్స్ మధ్య ఒప్పందం.!
- భారత్-ఫ్రాన్స్ మధ్య రాఫెల్ డీల్..
- 114 జెట్‌లను కొనుగోలు చేసే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rafale Deal: భారత్, ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల చివర్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ పర్యటన ముందు డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్(DAC) దీనికి పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతగా ఉన్న DAC రాబోయే రోజుల్లో సమావేశం కానుంది. రక్షణ కార్యదర్శి నేతృత్వంలోని రక్షణ సేకరణ బోర్డు గత నెలలో ఇప్పటికే రాఫెల్ కనుగోలు ప్రతిపాదనను ఆమోదించింది.
ఈ రాఫెల్ డీల్ ఓకే అయితే, భారత్ చరిత్రలోనే అతిపెద్ద యుద్ధ విమానాల సేకరణల్లో ఒకటిగా మిగులుతుంది. దీని విలువ సుమారుగా రూ. 3.25 లక్షల కోట్లు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తీవ్రమైన స్వ్కాడ్రన్ల కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఈ డీల్ కుదిరితే భారత వాయుసేన సామర్థ్యం మరింత పెరుగుతుంది. పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. భారత్‌కు 42 స్వ్కాడ్రన్ల యుద్ధ విమానాలు కావాలి, కానీ ప్రస్తుతం 29 మాత్రమే ఉన్నాయి.
Also Read
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
- INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
Read Also: Relationship Issues: వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్న ప్రియురాలు.. బాడీబిల్డర్ ఏం చేశాడంటే?
ఈ డీల్‌లో 18 విమానాలను ఫ్లై అవే స్టేటస్‌లో కొనుగోలు చేసే అవకాశం ఉంది, మిగిలిన వాటిని భారత్‌తో తయారు చేస్తారు. దాదాపు 80 శాతం విమానాలను దేశీయంగా ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా ఫ్రేమ్ వర్క్ కింద స్వదేశీ కంటెంట్ 60 శాతానికి చేరే అవకాశం ఉంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, 88 సింగిల్ -సీట్, 26-ట్విన్ సీట్ వేరియంట్లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేర్చుకుంటుంది. డస్సాల్ట్ ఏవియేషన్ స్థానిక తయారీ కోసం, భారతీయ ప్రైవేట్ రంగ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.
రాఫెల్ జెట్‌లలో అధునాతన రాడార్స్, సెన్సార్లు ఉన్నాయి. ఇవి లాంగ్ రేంజ్ దాడి సామర్థ్యాన్ని కల్పిస్తాయి. మెటియోర్ బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణి, స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణుల్ని రాఫెల్‌తో అనుసంధానించవచ్చు. ఆపరేషన్ సిందూర్ సమయంలో రాఫెల్ సామర్థ్యం ప్రత్యక్షంగా చూశారు.
తాజావార్తలు
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!