Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 9pm 07 02 2026

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Published Date :February 7, 2026 , 9:14 pm
By Gogikar Sai Krishna
  • చెత్త రికార్డ్‌ను సొంతం చేసుకున్న అభిషేక్..
  • హైదరాబాద్‌కు హైటెక్ సిటీలా.. దేశానికి క్వాంటం సెంటర్!
  • భారత్‌తో మ్యాచ్ ఆడుతుందా.. ఐసీసీతో పాకిస్తాన్ చర్చలు..
  • యూఎస్‌ఏ బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యా భాయ్.. టార్గెట్‌ ఎంతంటే!
Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

చెత్త రికార్డ్‌ను సొంతం చేసుకున్న అభిషేక్..

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-యూఎస్‌ఏ మ్యాచ్‌ స్టార్ట్ అయ్యింది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మకు ఈ రోజు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో ప్రేక్షకులు.. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లాగా ఓపెనింగ్ జోడీ అభిషేక్ – ఇషాన్ కిషన్‌ల నుంచి మెరుపులు ఆశించారు. కానీ ప్రేక్షకులు అనుకున్నది ఒక్కటైతే, మైదానంలో జరిగింది వేరేలా ఉంది. ఈ మ్యాచ్‌లో రెండవ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చిన అలీ ఖాన్, వచ్చి రాగానే తన మొదటి బంతికే అభిషేక్‌ను అవుట్ చేశాడు. దీనితో వాంఖడే స్టేడియంలో గుమిగూడిన వేలాది మంది అభిమానులు ఆశ్చర్యపోయారు.

యూఎస్‌ఏ బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యా భాయ్.. టార్గెట్‌ ఎంతంటే!

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అమెరికాతో జరుగుతున్న పోరులో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఒకానొక దశలో స్వల్ప స్కోరుకే పరిమితం అవుతుందనుకున్న భారత్‌ను తన సూపర్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసేలా ముందు ఉండి నడిపించాడు. యూఎస్‌ఏ విజయం సాధించాలంటే 162 పరుగులు చేయాల్సి ఉంది.

ఆపరేషన్ సిందూర్‌ను ‘‘ఘజ్వా-ఎ-హింద్’’‌గా అభివర్ణించిన పాక్ చీఫ్..

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్‌పై ఎలాంటి వ్యతిరేకతను ప్రదర్శించాడో, జైషే మహ్మద్ ఉగ్రవాది చెప్పడం సంచలనంగా మారింది. ఆపరేషన్ సిందూర్‌ను ‘‘ఘజ్వా-ఎ-హింద్’’గా అభివర్ణించాడని జైష్ ఉగ్రవాది ఇలియాస్ కాశ్మీరీ అన్నాడు. భారతదేశంపై మతపరమైన యుద్ధం చేసి, ఇస్లామిక్ పాలన స్థాపించాలనే సిద్ధాంతాన్ని ‘‘ఘజ్వా ఎ హింద్’’ సూచిస్తుంది. ఫిబ్రవరి 5న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని రావల్‌కోట్‌లో ఉగ్రవాదుల సమావేశంలో కాశ్మీరీ అన్నారు.

ఎనిమిదేళ్లు ఇందిరమ్మ రాజ్యమే.. వికారాబాద్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుస్తాం

వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా నారాయణపూర్‌లో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతిబాట బహిరంగ సభ పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కుల పంపిణీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను, తప్పులను సరిదిద్దుకుంటూ తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి కోసం ముందుకు వెళుతోందని ఆయన స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్, కేంద్రంలో పన్నెండేళ్లుగా ఉన్న మోదీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించిన ఆయన, బీజేపీ , బీఆర్ఎస్ పార్టీల మధ్య ‘చీకటి ఒప్పందాలు’ ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ కార్యకర్తలు తమ బీ-ఫామ్‌లను బీఆర్ఎస్ ఆఫీసుల నుండి తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేస్తూ, గల్లీలో పనిచేసే నాయకుడిని చూసి కాకుండా ఢిల్లీలో ఉండే పెళ్లి పెద్దను చూసి ఓట్లు వేయడం ఏమిటని ప్రజలను ప్రశ్నించారు.

మీకు అంత అహకారం పనికిరాదు.. ఎమ్మెల్యేపై అంబటి మౌనిక సీరియస్!

మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడి ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

భారత్‌తో మ్యాచ్ ఆడుతుందా.. ఐసీసీతో పాకిస్తాన్ చర్చలు..

T20 ప్రపంచ కప్‌ వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా క్రికెట్ ప్రపంచం దృష్టి ఇప్పుడు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌పై నెలకొంది. అయితే, ఈ మ్యాచ్ జరుగుతుందా.? లేదా? అనే సందేహాలు ఇంకా ఉన్నాయి. బంగ్లాదేశ్ టోర్నీ బహిష్కరణకు మద్దతుగా భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తామని పాకిస్తాన్ ప్రకటించింది. ఈ మేరకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా భారత్‌తో మ్యాచ్ ఆడబోవడం లేదని చెప్పారు. అయితే, ఐసీసీ నుంచి చర్యలు, ఆర్థిక నష్టం, శ్రీలంక ఆడాలని కోరడం చూస్తే పాకిస్తాన్ తప్పకుండా తన నిర్ణయం నుంచి యూటర్న్ తీసుకుంటుందని తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

కౌలాలంపూర్‌లో ప్రధాని మోడీ కీలక ప్రకటన.. మలేషియాలో త్వరలో UPI సేవలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మలేషియా పర్యటిస్తున్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ, ప్రజల మధ్య సంబంధాలను మరింతగా పెంచడం దీని ఉద్దేశ్యం. రాజధాని కౌలాలంపూర్‌లో తన ప్రసంగంలో, ప్రధాని మోడీ భారతదేశం-మలేషియా సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో మలేషియాలో UPI సేవలు ప్రారంభమవుతాయని కీలక ప్రకటన చేశారు. ప్రపంచంలోని అనేక దేశాలలో ఇప్పటికే UPI సేవలు అందుబాటులో ఉన్నాయి. భూటాన్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, యుఎఇ, సైప్రస్,ఒమన్ వంటి దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. భారతదేశం వెలుపల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఉపయోగించి BHIM యాప్ ద్వారా లావాదేవీలను సులభతరం చేసిన మొదటి దేశం భూటాన్.

హైదరాబాద్‌కు హైటెక్ సిటీలా.. దేశానికి క్వాంటం సెంటర్!

రాష్ట్ర రాజధాని అమరావతి వేదికగా మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి సాంకేతిక విప్లవం, యువత పాత్ర, భవిష్యత్తు ప్రణాళికలపై కీలక ప్రసంగం చేశారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో విద్యార్థులపై ఉన్న నమ్మకాన్ని పునరుద్ఘాటించారు. నా ఆశలన్నీ విద్యార్థులపైనే ఉన్నాయి. ఒక చరిత్ర రాయాలన్నా, లేదా ఉన్న చరిత్రను తిరగరాయాలన్నా అది కేవలం యువతకే సాధ్యం అని ఆయన అన్నారు. మన యువత ప్రస్తుతం క్వాంటం వేగంతో దూసుకుపోతోందని, వారి ఉత్సాహమే రాష్ట్రాన్ని అగ్రపథాన నిలుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా క్వాంటం కంప్యూటింగ్ ప్రాధాన్యతను వివరిస్తూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వీడిన చర్లపల్లి తల్లీపిల్లల సూసైడ్ మిస్టరీ.. ఆ మరణశాసనం వెనుక కారణం ఇదే.!

బోడుప్పల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ టీమ్ లీడర్ విజయశాంతిరెడ్డి (38), తన కుమార్తె చైతన్య రెడ్డి (18), కుమారుడు విశాల్ రెడ్డి (17)తో కలిసి జనవరి 31 తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతో ఉన్నత స్థాయిలో ఉండి, పిల్లలు కూడా బాగా చదువుకుంటున్న సమయంలో వీరు తీసుకున్న ఈ కఠిన నిర్ణయం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొన్ని రోజులుగా ఈ కేసులో మిస్టరీ కొనసాగగా, తాజాగా పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. విజయశాంతిరెడ్డి భర్త సురేందర్ రెడ్డి దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయనను కూడా పోలీసులు విచారించారు. కుటుంబంలో ఎటువంటి తగాదాలు లేవని, ఆస్తి పరంగా గానీ, ఆర్థికంగా గానీ ఎటువంటి ఇబ్బందులు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. విజయశాంతి రెడ్డికి తన తోటి ఉద్యోగులతో గానీ, ఇరుగుపొరుగు వారితో గానీ ఎటువంటి విభేదాలు లేవని ప్రాథమిక విచారణలో తేలింది.

అండర్-19 వరల్డ్ కప్ హీరో వైభవ్ సూర్యవంశీకి షాక్.. ఇకపై ఆడేందుకు నో ఛాన్స్!

వైభవ్ సూర్యవంశీ.. రాబోయే మరికొన్ని ఏళ్లు ప్రపంచవ్యాప్తంగా బాగా వినిపించే పేరు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దీనికి కారణం కేవలం అతడి ఆట తీరు. అండర్-19 ప్రపంచ కప్ 2026లో అద్భుత ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ మరోసారి ప్రపంచానికి తన సత్తా ఏంటో రుచి చూపించాడు. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్‌ లో 80 బంతుల్లో 175 పరుగులు చేసి భారత్‌ ను ఆరోసారి అండర్-19 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపి అనేక అరుదైన రికార్డులను సృష్టించాడు. ఫైనల్‌లో సెంచరీ చేసిన మూడవ భారతీయ ఆటగాడిగా నిలిచిన వైభవ్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులను ఒకేసారి అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరంగా.. అతనికి ఇంకా వయస్సు ఉన్న.. ఇకపై అండర్-19 ప్రపంచ కప్‌లో కనిపించడు. దీనికి కారణం.. మార్చి 27, 2011న జన్మించిన వైభవ్ వయస్సు పరంగా చూస్తే 2030 అండర్-19 ప్రపంచ కప్ వరకు అర్హత ఉంది. కానీ బీసీసీఐ (BCCI) అమలు చేస్తున్న నియమాల కారణంగా మరో ఎడిషన్‌లో ఆడే అవకాశం ఉండదు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Charlapalli Case
  • cm chandrababu
  • CM Revanth Reddy
  • Narendra Modi
  • telugu news

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions