Kidnap Case : మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు నోటీసులు జారీ.. అరెస్ట్ తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతిలో సంచలనం రేపిన విద్యార్థి నేతల అపహరణ కేసులో టాలీవుడ్ హీరో ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు చంద్రగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీపై నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఎస్‌ఎఫ్‌ఐ (SFI) నేతలను కిడ్నాప్ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని పోలీసులు ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.
Also Read : Budget Problems : భారీ బడ్జెట్ సమస్యతో ఆగిన క్రేజీ సూపర్ హీరో సీక్వెల్
Also Read
ఈ కిడ్నాప్ కేసులో యూనివర్సిటీ పీఆర్‌ఓ సతీష్‌ను ఏ-1గా , నటుడు మంచు విష్ణును ఏ-2 గా ఆయన తండ్రి సీనియర్ నటుడు మంచు మోహన్ బాబును ఏ-3 గా ఎఫ్ఐఆర్‌లో వారిని కీలక నిందితులగా చేర్చారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో పీఆర్‌ఓ సతీష్‌తో పాటు పలువురు బౌన్సర్లను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బాధితుల వాంగ్మూలం మరియు ప్రాథమిక ఆధారాల మేరకు యూనివర్సిటీ యాజమాన్యం ప్రోద్బలంతోనే ఈ కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ మంచు మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందని, తమ విద్యాసంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మంచు కుటుంబం ఆరోపిస్తోంది. అయితే ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్డ్ కారణంగా వారంలో విచారణకు వస్తానని పోలిసులకు తెలిపాడు మంచు విష్ణు .
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!